Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ రెండు మీడియాలకు ఆ వార్త పట్టలేదు

ఆ రెండు మీడియాలకు ఆ వార్త పట్టలేదు

ఆ వార్త అలాంటి ఇలాంటి వార్త కాదు. ఎవరిపైన అయిన సులువుగా బురద జల్లేసుకోవచ్చు. అలాంటి వార్తను సాధారణంగా ఆ రెండు మీడియాలు వదులుకోవు. జగన్ మీద జల్లేయడానికి హ్యాపీగా వాడేస్తాయి. కానీ అస్సలు పట్టించుకోలేదు. ఎందుకో? ఏమిటో? ఆ రెండు మీడియాలకే తెలియాలి. 

విషయం ఏమిటంటే.. సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరక్ట్ టాక్సెస్ సంస్థ ఉన్నట్లుండి ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.  దేశవ్యాప్తంగా వేల కోట్ల హవాలా రాకెట్ కు సంబంధించి ఓ చైన్ ను బ్రేక్ చేసినట్లు, ఇందులో భాగంగానే దేశంలోని 42 ప్రధాన నగరాల్లో వివిధ ఇన్ ఫ్రా సంస్థలకు సంబంధించి సోదాలు చేసినట్లు తెలిపింది.  అదే ప్రకటనలో మరో విషయం కూడా వెల్లడించింది. 

ఆంధ్రలోని ఓ ముఖ్య వ్యక్తికి 150 కోట్ల నగదు అందిందని తమ శోధనలో తేలిందని సెంట్రల్ బోర్డు తెలిపింది. అలాగే ఎవరా కీలక వ్యక్తి అన్న పేరులేదు. కేవలం ఆంధ్ర ప్రదేశ్ అన్నది మాత్రమే తెలిపారు. 

ఇప్పుడు ఈ వార్తనే ఆ రెండు మాధ్యమాలు కామ్ గా వదిలేసాయి. మామూలుగా అయితే జగన్ నే ఆ వ్యక్తి అని ఇండైరెక్ట్ గా పేర్కొని హడావుడి చేసేవి. కానీ ఈ దాడులు జరిగింది, ఆ వ్యవహారాలు జరిగింది జగన్ ప్రతిపక్షంలో వున్నపుడు. అందువల్ల కావచ్చు సైలంట్ గావుండిపోయాయి.

కానీ సాక్షి మాత్రం ఈ వ్యవహారాన్ని, ఆ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ స్టోరీ వేసింది. ఇంతకీ ఆ 'ముఖ్యవ్యక్తి' ఎవరై వుంటారు? ఆ 150 కోట్లు ఎక్కడ చేరి వుంటాయి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?