ఆర్థిక పరమైన నేరాలు, మోసాలు, వివాదాల్లో ఒకప్పుడు హీరోలు, నటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడీ వివాదాలు హీరోయిన్లకూ పాకుతున్నాయి. తమన్న, కాజల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇలా వరుసగా హీరోయిన్లు ఆర్థిక పరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
పాండిచ్చేరి పోలీసులు హీరోయిన్లు తమన్న, కాజల్ కు నోటీసులిచ్చారు. క్రిప్టోకరెన్సీకి పేరిట జరిగిన ఆర్థిక మోసానికి సంబంధించి వీళ్లిద్దరూ విచారణ ఎదుర్కోనున్నారు. 2022లో కోయంబత్తూరులో ఈ కంపెనీ ఏర్పాటైతే దానికి తమన్నా హాజరైంది. ఆ తర్వాత మహాబలిపురంలో జరిగిన ఈవెంట్ కు కాజల్ వచ్చింది.
ఇలా హీరోయిన్లను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టి నితీష్ జైన్, అరవింద్ కుమార్ డబ్బులు సేకరించారు. అలా 10 మంది నుంచి 2 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్టు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కాజల్, తమన్నాను కూడా విచారించబోతున్నారు.
ఆర్థిక నేరాలనగానే ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఈమె భారీగా లబ్ది పొందిందని ఈడీ ఆరోపిస్తోంది. మొన్నటికిమొన్న ప్రేమికుల రోజు కానుకగా ఈమెకు ఏకంగా ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని సుఖేష్ బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈడీ విచారణకు హాజరవుతూ ఈ కేసులో లోతుగా ఇరుక్కుపోయింది జాక్వెలిన్.
ఇదే కేసులో జాక్వెలిన్ తో పాటు, మరో హీరోయిన్ నోరా ఫతేహీ కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. సుఖేష్ కు చెందిన 215 కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించిన కీలక సాక్షి నోరా. ఆమె ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు ముందు హాజరై తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చింది.
జాక్వెలిన్ అంత కాకపోయినా రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ లాంటి హీరోయిన్లు కూడా ఆర్థిక పరమైన నేరాలు, వివాదాల్లో ఇరుక్కున్నారు. దేశాన్ని కుదిపేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో చాలామంది హీరోయిన్లు చిక్కుకున్నారు. వాళ్లలో ఒకరు శ్రద్ధా కపూర్ కూడా. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం శ్రద్ధా కపూర్ కు ఈడీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి తమన్న, హుమా ఖురేషీ, హీనా ఖాన్ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు లింక్ అయిన మనీ లాండరింగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2 సార్లు ఈడీ ఆమెకు గతంలో నోటీసులిచ్చింది. నాలుగేళ్ల కిందటి ఆ కేసులు ఇంకా నలుగుతూనే ఉన్నాయి.
వీళ్లతో పాటు మలయాళీ నటి ధన్య మేరీ వర్గీస్, బాలీవుడ్ హీరోయిన్లు గెహనా వశిష్ట్, శిల్పాషెట్టి కూడా పలు ఆర్థిక వివాదాల్లో చిక్కుకున్నారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
అసలు మాదక ద్రవ్యాల మాఫియా డాన్ లోడపిత్తుల కేటీఆర్ గాడు , గుడుంబా కవిత ఎక్కడ ఈ లిస్టులో ఓ వాళ్ళు జగన్ రెడ్డి బినామిలా ?