సూపర్ సిక్స్.. రూ. 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్!

రూ. 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు.

ఇవాళ అసెంబ్లీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి రూ. 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ పూర్తి స్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.39,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,920 కోట్లుగా అంచనా వేశారు. ఈ బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయానికి రూ. 48వేల కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతూ.. గ‌త ప్ర‌భుత్వ విధ్వంస పాల‌న కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంద‌ని.. జీతాలు కూడా చెల్లించ‌లేని స్ధితికి వెళ్లిందని.. రాష్ట్ర పున‌ర్నిర్మాణం స‌వాల్‌తో కూడుకుని ఉంద‌ని..దీనిని ఎలా అధిగ‌మించాలో చంద్ర‌బాబుకు బాగా తెలుసంటూ ఆయన్ను పొగడ్తలతో ముంచేశారు. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని.. అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు.

రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని రాజ‌ధాని చేశామ‌ని.. ఇప్ప‌టి నుండి అమ‌రావ‌తిలో పెద్దఎత్తున ప‌నులు చేప‌డ‌తామ‌న్నారు. అమ‌రావ‌తి నిర్మాణానికి బ‌డ్జెట్‌లో ఒక రూపాయి కూడా కేటాయించ‌క‌పోయిన ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని.. అమ‌రావ‌తి నిర్మాణానికి కావ‌ల్సిన నిధులు దానికి అదే తెచ్చుకుంటుంద‌న్నారు. ఈ బ‌డ్జెట్‌లో కీల‌కంగా సూపర్ సిక్స్ ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించడం విశేషం.

బడ్జెట్‌లో కేటాయింపులు… నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు వారిగా జ‌రిగాయి.

10 Replies to “సూపర్ సిక్స్.. రూ. 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్!”

  1. 80 వేల కోట్ల అప్పులు తెచ్చిన ఆదాయం 2 లక్షల 40 వేల కోట్లు దాటదు . మీరు బడ్జెట్ లో ఎన్ని అంకెలు వేసి బడ్జెట్ ని మసిపూసి మారేడు కాయ చేసి .. అంత ఇచ్చారు .. ఇంత ఇచ్చారు అని ప్రచారం చేసుకున్న అంత వేస్ట్ ha ha

  2. Waste patakaalu enduku sir. avi icchi jaffa gaadu ippudu intlo koosunnadu. What about our employees salaries sir. When are you forming PRC and giving us our IR and DA sir. When are you removing English medium sir. We teachers are facing lots of troubles sir. Please take care of our problems also sir. We are the main reason for kootami winning sir.

  3. జగన్ మోహన్ రెడ్డి: రాజకీయ నాటకంలో ఓ ఆసక్తికర పాత్ర

    జగన్ మోహన్ రెడ్డి అంటే గొప్ప నాయకుడు అనే అపభ్రంశం నుంచి బయటపడటానికి ప్రజలు చాలా కాలం తీసుకున్నారు. ఇక జగన్ మద్దతుదారులు మాత్రం, “జగన్ అన్న కోసం చరిత్రనే మార్చేస్తాం!” అని ఒక్కసారిగా చప్పట్లకు తెగిపోయే స్థితిలో ఉన్నారు. అధికారం లోపోయినా, నమ్మకం మాత్రం ఆకాశాన్ని తాకుతోంది. (ఎందుకంటే, వాళ్లకు ఎప్పుడూ జగన్ అన్న చరిత్రలో అత్యుత్తమ పాలకుడే!)

    గుడ్డి మద్దతు – ఒక ఆర్ట్ ఫార్మ్:

    ఒకే పొజిషన్‌లో ఎప్పుడు కనపడినా, అదే విషయాన్ని పదేపదే చెప్పినా, అదే వాళ్ల దగ్గర “యథార్థ నిస్వార్థం” అవుతోంది. జగన్ అన్న ఏ పని చేసినా, వాళ్లకు అదే “విజయ సంకేతం”. కోర్టు కేసుల మీద దృష్టిపెడితే, “అదే ధైర్యం” అంటారు. కుటుంబ గొడవల గురించి వెలుగులోకి వస్తే, “అదే నిజాయతీ” అని చెబుతారు. ఇదంతా “ఇవాల్యూషన్ ఆఫ్ వెరైటీ” – ఒకే విషయం రకరకాలుగా చెప్పడం. కానీ ఎప్పటికీ కొత్తగా చెప్పినా, ఆ శ్రద్ధ మాత్రం అసలే తగ్గదు!

    ట్రోలింగ్ ట్రోలింగ్ ఆహా:

    ఎవరైనా వైసీపీపై తక్కువగా మాట్లాడితే, “నీకు ఓలా బుకింగ్” అనే సరదా వ్యాఖ్యలు ఉంటాయి. జగన్‌ను ప్రశ్నించేవాళ్లకి “నీ డిపాజిట్ ఎవడికి?” అని వినోదాత్మక కౌంటర్లు ఇస్తారు. ఇది వ్యంగ్యంతో నిండిన ఓ మంచి రిటార్ట్ ఆటలా ఉంటుంది. “జగన్ అన్నకు ఏమాత్రం సంభావన ఉన్నందుకే అంతా తిట్టుతున్నారు!” అని అభిమానం మరింత ఎగరేస్తారు. సరే, దీని వెనుక వారి హాస్యాసక్తి తప్ప మరే ఆలోచన ఉండదు!

    అనుభూతి – జగనంటే ఓ పెద్ద ‘ఎక్స్‌పీరియన్స్’

    జగన్ మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం ఓ ఆధ్యాత్మికానుభూతి. “జగన్ అన్నను ఓడించినంత మాత్రానా, ఆయన గెలిచినట్లు ఉంటారు” అనే ధైర్యవంతమైన వాక్యాలు వింటే చాలు – వైసీపీ అభిమానుల సర్కస్ ఉత్సవాలు మొదలవుతాయి. వాళ్ల అపారమైన విశ్వాసానికి సాటే లేదు – జగన్ పతనం వారికీ ఇంకా ఒక శ్రావ్య సంగీత కార్యక్రమం లాంటిది!

Comments are closed.