డిజాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది

థియేటర్లలో హిట్టయిన సినిమాలు టీవీల్లో ఫ్లాప్ అవ్వడం, ఫ్లాప్ అయిన సినిమాలు టీఆర్పీల్లో సక్సెస్ అవ్వడం ఇంతకుముందు చూశాం. కానీ ఇది వాటిలో పీక్ స్టేజ్. థియేటర్లలో డిజాస్టర్ అయింది, కట్ చేస్తే టీవీల్లో…

థియేటర్లలో హిట్టయిన సినిమాలు టీవీల్లో ఫ్లాప్ అవ్వడం, ఫ్లాప్ అయిన సినిమాలు టీఆర్పీల్లో సక్సెస్ అవ్వడం ఇంతకుముందు చూశాం. కానీ ఇది వాటిలో పీక్ స్టేజ్. థియేటర్లలో డిజాస్టర్ అయింది, కట్ చేస్తే టీవీల్లో బంపర్ హిట్టయింది. అదే ఆదికేశవ.

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఆదికేశవ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. రిలీజైన రెండో రోజుకే దుకాణం సర్దేసింది. ఇలాంటి సినిమా బుల్లితెరపై దుమ్ము దులిపింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ఆదికేశవ సినిమాను ప్రసారం చేస్తే, ఏకంగా 10.29 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. ఈమధ్య కాలంలో ప్రభాస్, చిరంజీవి, పవన్ కల్యాణ్ నటించిన సినిమాలకు కూడా ఈ స్థాయిలో రేటింగ్ రాలేదు. 

రీసెంట్ గా కాస్త  మంచి రేటింగ్స్ తెచ్చుకున్న సినిమాల్లో ధమాకా ఒకటి. ఇప్పటికీ ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. అందులో శ్రీలీల ఉంది. ఇప్పుడీ ఆదికేశవ సినిమాలో కూడా శ్రీలల ఉంది. ఆ ఫ్యాక్టర్ ఏమైనా కలిసొచ్చిందేమో.

చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు వైష్ణవ్ తేజ్. ఇంకా చెప్పాలంటే ఉప్పెన తర్వాత సరైన హిట్ లేదు. ఆదికేశవ కూడా ఫ్లాప్. ఇలాంటి టైమ్ లో వచ్చిన ఈ రేటింగ్, వైష్ణవ్ తేజ్ కు కాస్త ఉత్సాహాన్ని అందించి ఉంటుంది.