ప్రభాస్ హీరో పాత్రలో రూపొందుతున్న హిందీ, తెలుగు సినిమా ఆదిపురుష్ టీజర్ త్వరలోనే విడుదల కాబోతోంది. అక్టోబర్ మూడో తేదీన ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారట రూపకర్తలు.
ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మైథాలజీ నేపథ్యంలో రూపొందుతోంది. రామయాణాన్నే ఈ రూపంలో రూపొందిస్తున్నారనే టాక్ ఉంది.
కృతీ సనన్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ చేస్తోంది. బాహుబలి సీరిస్ తర్వాత హిందీ బెల్ట్ లో ప్రభాస్ కు పెరిగిన ఫాలోయింగ్ కు ప్రతిరూపాల్లో ఒకటి ఈ సినిమా. సాహో హిందీ బెల్ట్ లో రాణించినా, రాధేశ్యామ్ మాత్రం సర్వత్రా నిరాశపరిచింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ మార్కెట్ చెక్కుచెదరలేదని నిరూపించడానికి ఆదిపురుష్ భారీ విజయాన్నే నమోదు చేయాల్సి ఉంది.
ఒకవేళ రామాయణాన్నే యథాతథంగా రూపొందిస్తూ ఉన్నట్టైతే.. కాస్త ప్రయోగాత్మకమే ఈ సినిమా అనుకోవాలి. ఈ సినిమా కాన్సెప్ట్ ఏమటనే మిస్టరీ కూడా టీజర్ విడుదలతోనే తొలగిపోనుంది. టీజర్ విడుదల తర్వాత ఈ సినిమా ప్రచారపర్వంపై ఈ సినిమా యూనిట్ దృష్టి సారించనుందని తెలుస్తోంది.