అడుగు బయటపెడుతున్న పవన్

చాలా ఏళ్ల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ కోసం తెలుగు రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే హైదరాబాద్ దాటి వెళ్తున్నారు.  Advertisement రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర…

చాలా ఏళ్ల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ కోసం తెలుగు రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే హైదరాబాద్ దాటి వెళ్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పవన్ తన షూటింగ్ లు అన్నీ హైదరాబాద్ కే పరిమితం చేసారు. అటు పొలిటికల్ పనులు, ఇటు సినిమా పనులు అన్నీ కలిపి, అడుగు బయట పెట్టకుండా చేసాయి. సినిమాల్లోకి రీ ఎంట్రీ తరువాత చేసిన సినిమాలు అన్నీ హైదరాబాద్ లోనే. భీమ్లా నాయక్ లాంటి సినిమా కు కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే సెట్ లు వేసారు. ఒకటి రెండు అవుట్ డోర్ షాట్ లు కేవలం యూనిట్ వెళ్లి షూట్ చేసుకుని వచ్చింది.

ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత పవన్ ముంబాయి వెళ్తున్నారు. ఓ జి సినిమా షూట్ లో అయిదు రోజులు పాల్గొంటారు. ఓజి సినిమా షూట్ ఇప్పటికే ముంబాయిలో జరుగుతోంది. 18 నుంచి అయిదు రోజులు పవన్ కూడా వుంటారు. పవన్ షూట్ ముగిసిన తరువాత కూడా 28 వరకు ఓజి షూట్ అక్కడ జరుగుతుంది. ఓజి నుంచి వచ్చి హరి హర వీరమల్లు షూట్ లో పాల్గొంటారు.

ఇదిలా వుంటే ఓజి స్క్రిప్ట్ ఫైనల్ చేసానని సింబాలిక్ గా చెబుతూ దర్శకుడు సుజిత్ ఓ గ్రాఫిక్స్ వీడియో ను విడుదల చేసారు. సినిమా సబ్జెక్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని సింబాలిక్ గా ఆ వీడియోలో చూపించేసారు.