ఊర్వశి రౌతాలా తెలుగు వారికి ఒక లక్కీ ఐటమ్ స్టార్ గా మారిపోతున్నట్లు కనిపిస్తోంది. రామ్ – బోయపాటి సినిమాలో ఓ సాంగ్ చేసింది. ఇంకా విడుదల కావాల్సి వుంది. వేర్ ఈజ్ ద పార్టీ అంటూ మెగాస్టార్ సరసన ఓ ఆట ఆడేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది.
ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేసేస్తోంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఏజెంట్ సినిమాలో ఓ మాంచి మాస్ నెంబర్ వుంది.
సినిమా మొత్తానికి కీలకమైన పాట ఇదొక్కటే. ఈ పాటలో అఖిల్ సరసన ఊర్వశి డ్యాన్స్ చేస్తోంది. ఈ మాస్ ట్యూన్ కోసమే చాలా కాలం వెయిట్ చేసి, చేసి ఆఖరికి ఫైనల్ చేసారు. ఈ నెల 28న ఏజెంట్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్లు ఖర్చు చేసారు.
సినిమాను భారీ రేట్లకు మార్కెట్ చేసారు. ఈ సినిమా మీద ఇటు అక్కినేని ఫ్యాన్స్ అటు సురేందర్ రెడ్డి అభిమానులు కూడా చాలా హొప్ పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ నే చాలా అంటే చాలా కాలం పట్టేసింది. మరి థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు అలరింప చేస్తుందో చూడాలి.