ఆయన ఇండస్ట్రీ పెద్దాయిన. కొన్ని విలువలు, పద్దతులు పాటించే మనిషి. వీలయినంత వరకు వివాదాలకు, విమర్శలకు దూరంగా వుండే వ్యక్తి. నవ్వుతూ మాట్లాడడం, నవ్వుతూనే చురకలు వేసేయడం తప్ప, ముందు..వెనుకలు వుండవు. అలాంటి పెద్దాయినకు మనసు గాయపడినట్లుంది.
నోటు మాట కన్నా, నోటి మాటకు విలువ వుండాలి కదా టాలీవుడ్ లో..అదే కదా దశాబ్దాల కాలంగా ఇక్కడ జరుగుతూ వస్తోంది. ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి. మనుషులు మారిపోతున్నారు. మాట మారిపోతోంది. అని ఆయన ఆవేదన. అలాంటి టైమ్ లో ఓ అనుకోని వ్యవహారం జరిగింది.
అంతే ఆయన మరింత ఫీలయినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తుల ఫోన్ లు ఎత్తడం మానేసినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు ఇండస్ట్రీ లో కీలకమైన వ్యక్తి కావడం విశేషం. అయినా కూడా ఫోన్ లేపడం మానేసారు. దాంతో ఆ వ్యక్తి తెగ ఫీలవుతున్నట్లు బోగట్టా. ఇదంతా తన ప్రాజెక్టుకు సంబంధించిన విషయం ముందుగానే లీక్ కావడం వల్లనే అని, ఎవరు లీక్ చేసారు. ఎలా లీక్ అయింది అంటూ తన పీఆర్ టీమ్ కు క్లాస్ పీకినట్లు బోగట్టా.
చినికి చినికి గాలివాన అవుతుందేమో? పెద్దాయిన ఆగ్రహం ఎక్కడికి దారితీస్తుందో అని టాలీవుడ్ లో చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు.