తమిళ హీరోల పోటీ.. అజిత్ రియాక్షన్ ఇది

ఏ పరిశ్రమలోనైనా హీరోల మధ్య పోటీ సహజం. టాలీవుడ్ లో కూడా హీరోల మధ్య పోటీ ఉంది. కానీ కోలీవుడ్ లో ఇది తారాస్థాయిలో నడుస్తుంటుంది. తమిళ ఇండస్ట్రీ సంగతుల్ని కాస్త లోతుగా గమనించేవాళ్లకు…

ఏ పరిశ్రమలోనైనా హీరోల మధ్య పోటీ సహజం. టాలీవుడ్ లో కూడా హీరోల మధ్య పోటీ ఉంది. కానీ కోలీవుడ్ లో ఇది తారాస్థాయిలో నడుస్తుంటుంది. తమిళ ఇండస్ట్రీ సంగతుల్ని కాస్త లోతుగా గమనించేవాళ్లకు ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమౌతుంది.

ఇప్పటికీ రజనీకాంత్ ను సూపర్ స్టార్ గా అంగీకరించని ఓ హీరో వర్గం ఉందక్కడ. విజయ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నా, భవిష్యత్తులో కూడా అతడ్నే నంబర్ వన్ హీరోగా అందరూ అంగీకరించాలని డిమాండ్ చేసే మూర్ఖపు ఫ్యాన్స్ కూడా ఉన్నది అక్కడే.

మరి అలాంటి వాతావరణంలో ఇన్ని దశాబ్దాలుగా హీరో అజిత్ ఎలా కొనసాగుతూ వస్తున్నాడు. దీనికి అతడిచ్చే సమాధానం చాలా సింపుల్.

“జనబాహుళ్యంలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా కాస్త క్రేజ్ తో కొనసాగుతున్నప్పుడు, కొంతమంది మనపై ఈర్ష్య పడడం సహజం. స్టార్ డమ్ కు నెగెటివ్ సైడ్ కూడా ఉంటుంది. అది నేను చాలా చూశాను. అందుకే నేను పోటీని పట్టించుకోను, నా తరహాలోనే నేను ముందుకెళ్లిపోతుంటాను. గొడవల్ని నేను ఎవాయిడ్ చేస్తుంటాను, అలా అని నేను ఎస్కేప్ అవ్వను. నా యుద్ధం ఏంటో నాకు తెలుసు. అందులో నేను గెలవాలనుకుంటాను. ఎదుటి వ్యక్తి నా నుంచి కోరుకునే యుద్ధం నేను ఎప్పటికీ చేయను. ఈ విధానం నాకు బాగా పనిచేసింది.”

ఓ వ్యక్తికి మనం టైమ్ కేటాయించాలంటే, అసలు ఆ వ్యక్తికి అంత స్థాయి ఉందో లేదో అనే విషయాన్ని ముందుగా గుర్తించాలంటున్నాడు అజిత్. ఇది తెలుసుకుంటే ఎవరితో పోటీ పడాలి, ఎలాంటి యుద్ధాన్ని ఎంపిక చేసుకోవాలో తెలుస్తుందంటున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ అజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ లో చిన్నపాటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

2 Replies to “తమిళ హీరోల పోటీ.. అజిత్ రియాక్షన్ ఇది”

  1. Last lo ‘ eduta vyakti na nundi korukuney yudham nenapatki chynu ‘ ..super philosophy ajith sir ..ee oka line ki ni fan ipoyaaa

Comments are closed.