తమ హీరోకు చిన్న జ్వరం వస్తేనే ప్రత్యేక పూజలు నిర్వహించే అభిమానులున్న సమాజం మనది. తమ అభిమాన హీరో కోలుకుంటే మోకాలిపై నడిచొస్తామని మొక్కుకునే వీరాభిమానులున్న దేశం మనది. ఇలాంటి దేశంలో హీరోగా కొనసాగుతూ, తన అభిమానుల్ని తెగ టెన్షన్ పెడుతున్నాడు అజిత్.
ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా 3 సార్లు ఇతడు ప్రమాదాలకు గురయ్యాడు. ఈ నెలలో ఇది రెండో ప్రమాదం. మరి ఫ్యాన్స్ కు టెన్షన్ ఉండదా? అందుకే వాళ్లు తమ హీరోకు ప్రత్యేక విన్నపాలు చేస్తున్నారు. రేసింగ్ వదిలేసి వచ్చేయాలని, తమ కోసం సినిమాలు చేయాలని కోరుతున్నారు.
అయితే అజిత్ అలాంటివి వినే రకం కాదు. ఆయనకు రేసింగ్ అంటే ప్రాణం. ఎంతలా అంటే, 15 ఏళ్ల గ్యాప్ తర్వాత, 53 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ రేసర్ గా అడుగుపెట్టాడు. అంతేకాదు, తన పేరు మీద ఏకంగా ఓ టీమ్ స్టార్ట్ చేశాడు. అది అతడి తపన. వద్దనడానికి మనం ఎవ్వరం.
మొన్నటికిమొన్న రేస్ ట్రాక్ పై చిన్న ప్రమాదంతో బయటపడ్డాడు అజిత్. అయితే ఈసారి మాత్రం ప్రమాద తీవ్రత పెద్దది. ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టడంతో పాటు.. ట్రాక్ పై వరుసగా 2సార్లు పల్టీలు కొట్టింది కారు.
ఈసారి కూడా దేవుడు అజిత్ వైపున్నాడు. ఎలాంటి గాయల్లేకుండా బయటపడ్డాడు. బయటకొచ్చి అభివాదం కూడా చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత అతడి ఫ్యాన్స్ లో ఆందోళన డబుల్ అయింది. మళ్లీ రేసింగ్ చేయొద్దంటూ విజ్ఞప్తులు ఈసారి మరింత ఎక్కువయ్యాయి.
రీసెంట్ గా విడాముయర్చి సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు అజిత్. అతడు నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,