అప్పుడెప్పుడో ఓ సినిమా వచ్చింది. ఆడవాళ్లు ఇంట్లో లేని మగ కుటుంబం. అయితే అది సీరియస్ సినిమా. ఇప్పుడు మజాకా అంటూ వస్తోంది. ఇంట్లో ఆడవాళ్లు లేరు. ఫ్యామిలీ అంటూ వుండాలి. ఫ్యామిలీ ఫోటో గోడకి వుండాలి అని తపన పడే తండ్రీ కొడుకులైన ఇద్దరు మగాళ్ల కథ. రావు రమేష్-సందీప్ కిషన్ నటించిన మజాకా సినిమా ట్రయిలర్ చెబుతున్నది ఇదే.
ఫ్యామిలీ కోసం తపన పడుతూ తండ్రి ఓ ఆంటీ వెనుక, కొడుకు ఓ అమ్మాయి వెనుక పడే కథ. ఈ కథలో చిన్న ట్విస్ట్ ఫ్యాక్టర్. అంతకన్నా పెద్దగా కథ వున్నట్లు కనిపించడం లేదు.
ఈ కథ నడకలో డ్యూయెట్స్, పాటలు, ఫన్ సీన్లు, పంచ్ డైలాగ్స్ మిక్స్ అయ్యాయి. దర్శకుడు నక్కిన త్రినాధరావు-రచయిత బెజవాడ ప్రసన్న కాంబినేషన్ అంటే ఇంతకన్నా ఎక్కువ ఊహించినక్కర లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ మీదనే ఫోకస్ అంతా వుంటుంది. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏదో ఒక లైన్. మజాకా సినిమా ట్రయిలర్ లో అన్నీ సమపాళ్లలో కలిపి వదిలారు. సందీప్ కిషన్ కు కావాల్సిన హీరో సీన్లు, లవ్, రొమాన్స్, రావు రమేష్ కు కూడా జోడించారు. ఫన్ సీన్లు కూడా ఇద్దరికీ పంచేసారు.
మొత్తానికి ఓ పాప్ కార్న్ ఎంటర్‌టైనర్ ను అందిస్తున్నారు నిర్మాత రాజేష్ దండా. బెజవాడ ప్రసన్న రాసిన డైలాగ్స్ అక్కడక్కడ పాయసంలో జీడిపప్పుల్లా తగిలాయి. పాటలు స్క్రీన్ మీద బాగుండేలా వున్నాయి. రీతూ వర్మ, అన్షు ట్రయిలర్ కు కలర్ ను జోడించారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు,