రావురమేష్ పై ఎలాంటి ఈర్ష్య లేదు

నాకు, రావురమేష్ కు సమానమైన స్క్రీన్ టైమ్ ఉంది. ఆయన మీద నాకు 2 పాటలు, ఒక ఫైట్ ఎక్స్ ట్రా ఉన్నాయంతే.

తెరపై తమ కంటే మరో నటుడి డామినేషన్ ఎక్కువైతే చాలామంది హీరోలు తట్టుకోలేరు. చాన్నాళ్ల పాటు మల్టీస్టారర్స్ రాకపోవడానికి కూడా ఇదే కారణం. ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ఇదే విషయంపై సందీప్ కిషన్ కూడా స్పందించాడు. మజాకా సినిమాలో తనతో సమానంగా తెరపై కనిపించిన రావురమేష్ పై తనకు ఎలాంటి ఈర్ష్య లేదంటున్నాడు.

“నాకు, రావురమేష్ కు సమానమైన స్క్రీన్ టైమ్ ఉంది. ఆయన మీద నాకు 2 పాటలు, ఒక ఫైట్ ఎక్స్ ట్రా ఉన్నాయంతే. దాని వల్ల నేను ఎలాంటి ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. ఆయన కేవలం సీన్ లో ఉండడమే కాదు, సన్నివేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. అద్భుతంగా చేశారు. నాతో సమానంగా ఆయనకు స్క్రీన్ టైమ్ ఉందనే ఈర్ష్య నాకు ఎప్పుడూ కలగలేదు.”

కథ బాగుండడం వల్ల రావురమేష్ పై తనకు అలాంటి ఫీలింగ్ రాలేదన్నాడు సందీప్ కిషన్. తనతో పాటు ఆయన కూడా హీరో అని ఓపెన్ గా చెబుతున్నాడు.

“రావు రమేష్ లాంటి నటుడితో నటించడం నా లక్కీ, ఆయన వల్ల సీన్స్ బాగా పండాయి. నేను ఇప్పుడు కూడా గర్వంగా చెబుతున్నాను. మజాకా సినిమాలో నేను ఒక హీరో, ఆయన ఇంకో హీరో. ఆ మాట చెప్పడానికి ఆయన మొహమాటపడినా, నేను మొహమాటపడను. నాకు అలాంటి ఇగోస్ లేవు.”

మజాకా ట్రయిలర్ లాంచ్ చేశారు. తొలిసారి ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించారు రావు రమేష్. మారుతీనగర్ సుబ్రమణ్యం, మజాకా లాంటి సినిమాల కోసం కొన్ని రొటీన్ పాత్రలు వదులుకున్నా ఇబ్బంది లేదంటున్నారు రావురమేష్.

One Reply to “రావురమేష్ పై ఎలాంటి ఈర్ష్య లేదు”

Comments are closed.