బొల్లాను త‌ప్పించ‌క‌పోతే.. వైసీపీని వీడుతాం!

బొల్లాను ఇన్‌చార్జ్‌గా త‌ప్పించాల‌ని, లేదంటే తాము పార్టీని వీడ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని వైవీ సుబ్బారెడ్డికి తేల్చి చెప్పారు.

ప‌ల్నాడు జిల్లా వినుకొండ వైసీపీలో అస‌మ్మ‌తి రోజురోజుకూ పెరుగుతోంది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎమ్మెల్యేగా బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు త‌మ‌కు క‌నీస గౌర‌వం ఇవ్వ‌లేద‌ని, కేసులు పెట్టించి వేధించారంటూ కొంద‌రు వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల క్రితం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని క‌లిసి అధిష్టానానికి అల్టిమేట‌మ్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ పార్టీ ముఖ్య నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డిని మ‌రోసారి అస‌మ్మ‌తి నేత‌లు క‌లిశారు.

బొల్లాను ఇన్‌చార్జ్‌గా త‌ప్పించాల‌ని, లేదంటే తాము పార్టీని వీడ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని వైవీ సుబ్బారెడ్డికి తేల్చి చెప్పారు. అయితే తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు వ‌ద్ద‌ని, జ‌గ‌న్‌తో మాట్లాడి అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని వైవీ అన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్ర‌హ్మ‌నాయుడు విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ సానుకూలంగా ఉన్నారు.

వైసీపీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న పార్టీని న‌మ్ముకుని ఉన్నారు. ఎన్ని ర‌కాలుగా ప్ర‌లోభ పెట్టినా ఆయ‌న త‌లొగ్గ‌లేద‌నే అభిమానం బ్ర‌హ్మ‌నాయుడిపై వుంది. అయితే వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు వినుకొండ‌లో పార్టీకి న‌ష్టం తెస్తున్న‌ట్టు అధిష్టానం పెద్ద‌లు భావిస్తున్నారు.

వినుకొండ‌లో స‌మ‌స్య వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ నేప‌థ్యంలో స‌ర్దుబాటు చేయాల‌ని పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నా ఫ‌లితం లేకుండా పోతోంది. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు, విడ‌వ‌మంటే పాముకు కోపం అనే చందంగా వినుకొండ వైసీపీలో ప‌రిస్థితి వుంది. దీన్ని ఏ విధంగా ప‌రిష్క‌రిస్తారో మ‌రి!

9 Replies to “బొల్లాను త‌ప్పించ‌క‌పోతే.. వైసీపీని వీడుతాం!”

    1. ఆ పనిలోనే ఉన్నారు…బేరాలు తెగితే ..ఆ కార్యక్రమం కూడా జరిగిపోతుంది

    2. BjP కలిపేయండి ప్రతి ఎలెక్షన్ లో పొత్తు కోసం కళ్ళు బేరం తప్పుతుంది బాబు కి

      1. ప్రతిపక్ష హోదా అడుక్కునే మీకు మా సలహాలు అవసరం అవుతుంది..

        అధికారం లో ఉన్న మాకు నీలాంటి కుక్కల సలహాలు అవసరం లేదు ..

        ..

        మీ మంచి కోసమే చెప్పాను.. ఇంకొన్నాలు ఆగితే.. వైసీపీ ఆఫీసులకు తాళాలు కూడా వేయరు.. జనాలే పడగొట్టేస్తారు..

  1. అదేంది రెండు రోజుల క్రితమేగా ఇతనిని చెక్కగా ఉంటాడు అన్నది

  2. సరిపోయింది అసలు సజ్జల మీద ఉన్నంత వ్యతిరేకత ఇంకెవరి మీద ఐన ఉండిందా ….సరే ఇతన్నే కదా అన్న గ్లామరోస్ గ ఉంటారు అనింది…..మరి ఇతను పొతే పార్టీ లో గ్లామర్ పరిసితి ఏంటి ???

Comments are closed.