రాజీనామా చేశాడు.. వెంటనే మళ్లీ చేరాడు

అతడిని శుక్రవారం, శనివారం బుజ్జగించారు. ఆయన డిమాండ్లకు అంగీకరించడంతో తిరిగి కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. 

రాజకీయాల్లో పార్టీలు మారడం, రాజీనామా చేసిన పార్టీలోనే మళ్లీ చేరడం మామూలే. వీళ్లనే అయారామ్​…గయారామ్​లు అంటారు. ఈ మధ్యనే ఓ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశాడు. కాని మళ్లీ వెంటనే అదే పార్టీలో చేరాడు. ఆయన పేరు కోనేరు కోనప్ప.

సిర్పూర్​ కాగజ్​ నగర్​ మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెసు పార్టీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో కోనప్ప పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీకి దెబ్బ అని గుర్తించిన నాయకత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీంతో అతడిని బతిమిలాడి బామాలి ఎట్టకేలకు మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారనే వాదన వినిపిస్తోంది.

అలా కాదని ఆయనంతట ఆయనే తిరిగి పార్టీలోకి వచ్చారని ఒక వాదన వినిపిస్తోంది. ఈ వాదనలు ఎలా ఉన్నా మొత్తం మీద కోనప్ప తిరిగి పార్టీలో చేరాడు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఏడాది కాకుండానే అక్కడ ఇమడలేకపోయాడు.

అధికారం ఉన్నా కూడా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో అభివృద్ధి పనులు చేపట్టకపోవడం.. మంజూరైన ఫ్లైఓవర్‌ను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది.  ఈ పరిణామాలతో ఆయన అలిగి శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశాడు. అతడి రాజీనామాతో కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. స్థానిక ఎన్నికల ముంగిట ఈ పరిణామం భారీ దెబ్బ తీస్తుందని భావించిన పార్టీ అధిష్టానం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

అతడిని శుక్రవారం, శనివారం బుజ్జగించారు. ఆయన డిమాండ్లకు అంగీకరించడంతో తిరిగి కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌ రెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్, కుసుమ్ కుమార్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కనిపించారు.

2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్ప బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు.  2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవగా.. 2023 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆ ఎన్నికల సమయంలో తనపై పోటీ చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో అసంతృప్తితో గులాబీ రాజీనామా చేశాడు….వెంటనే మళ్లీ చేరాడు

2 Replies to “రాజీనామా చేశాడు.. వెంటనే మళ్లీ చేరాడు”

Comments are closed.