ఇప్పటికీ నా వయసు పదహారే

మనసు ప్రశాంతంగా ఉంచుకొని, పాజిటివ్ గా ఆలోచిస్తే అందరూ అందంగా కనిపిస్తారని, అదే తన గ్లామర్ సీక్రెట్ అని చెబుతోంది.

“ఇప్పటికింకా నా వయసు..” అంటూ పోకిరి సినిమాతో దుమ్ముదులిపిన ముమైత్ ఖాన్ చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం అవకాశాలు రాకపోయినా, ఆమె మాత్రం హైదరాబాద్ ను వదల్లేదు. తాజాగా ఆమె హైదరాబాద్ లో మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ప్రారంభించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ముమైత్ ఖాన్, తనలో ఇంకా స్టామినా తగ్గలేదని చెబుతోంది. మంచి సాంగ్ ఆఫర్ చేస్తే ఏ హీరో సరసనైనా అద్భుతంగా డాన్స్ చేస్తానని చెబుతోంది. ఓవైపు అవకాశాల కోసం ఎదురుచూస్తూనే, మరోవైపు బిజినెస్ లోకి అడుగుపెట్టానంటోంది.

పెద్ద యాక్సిడెంట్ తర్వాత దాదాపు సినిమాలకు దూరమైన ముమైత్, తను ముంబయిలోనే ఉంటానని, హైదరాబాద్-ముంబయి మధ్య చక్కర్లు కొట్టడం తనకు ఇష్టమని చెబుతోంది.

39 ఏళ్ల ముమైత్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. మనసుకు నచ్చిన మగాడు దొరకలేదని, తనను భరించే సత్తా ఎవరికైనా ఉందా లేదా అనేది ఇంకా తనకు తెలియదంటోంది. మనసు ప్రశాంతంగా ఉంచుకొని, పాజిటివ్ గా ఆలోచిస్తే అందరూ అందంగా కనిపిస్తారని, అదే తన గ్లామర్ సీక్రెట్ అని చెబుతోంది.

2 Replies to “ఇప్పటికీ నా వయసు పదహారే”

Comments are closed.