అజిత్ హీరోగా నటించిన సినిమా తెగింపు. సంక్రాంతి బరిలో అందరికంటే ముందు రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. అలా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా థియేటర్లు దక్కించుకున్న ఈ సినిమా, అజిత్ కెరీర్ లోనే టాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.
భారీ ఓపెనింగ్ కు తగ్గట్టు ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. తొలి రోజు తెగింపు సినిమాకు 2 కోట్లకు కాస్త ఎక్కువగా గ్రాస్ వచ్చింది. అయితే రెండో రోజు వీరసింహారెడ్డి రాకతో ఈ సినిమా పూర్తిగా వాష్ అవుట్ అయింది. దీంతో ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనే అనుమానాలు మొదలయ్యాయి.
వీరసింహారెడ్డి రాకతో రెండో రోజుకు దాదాపు 60 శాతం స్క్రీన్స్ ను కోల్పోయింది తెగింపు సినిమా. దీనికితోడు మొదటి రోజు నెగెటివ్ టాక్ రావడంతో, రెండో రోజు థియేటర్ మొహం చూడలేదు ప్రేక్షకుడు. ఇవాళ్టి నుంచి వాల్తేరు వీరయ్య రావడంతో, ఈ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ తగ్గిపోయాయి. ఇలా దెబ్బ మీద దెబ్బ అన్నమాట.
ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇప్పుడీ పెట్టుబడి వెనక్కి వస్తుందా రాదా అనేది డౌట్. మరో 2 రోజుల్లో తెగింపు సంగతి తేలిపోతుంది.