నెల తిరక్కుండానే ఓటీటీలోకి!

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా, నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

సాధారణంగా పెద్ద సినిమాలు తొందరగా ఓటీటీలోకి రావు. అలా వచ్చాయంటే సినిమా రిజల్ట్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా విడాముయర్చి సినిమా కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా, నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

మార్చి 3వ తేదీన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రత్యక్షం కాబోతోంది. అప్పటికి సినిమా థియేటర్లలోకొచ్చి నెల రోజులు పూర్తవ్వదు.

తెలుగులో ‘పట్టుదల’ పేరిట రిలీజైంది విడాముయర్చి. పూర్తిస్థాయి రోడ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత పూర్తిగా గాడితప్పింది. తెలుగులో అజిత్ సినిమాలు హిట్టయి చాన్నాళ్లయింది. పట్టుదల కూడా తన పట్టు చూపించలేకపోయింది. అటు తమిళనాట కూడా ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. కలెక్షన్ పోస్టర్లు మాత్రం ఘనంగా వేసుకున్నారు.

మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన పట్టుదల సినిమాలో అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్, రెజీనా నెగెటివ్ రోల్స్ లో కనిపించారు. తెలుగులో అనిరుధ్ సంగీతం కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది.

3 Replies to “నెల తిరక్కుండానే ఓటీటీలోకి!”

Comments are closed.