హీరో సందీప్ కిషన్ 30వ సినిమా ‘మజాకా’. దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఎంటర్ టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
-మజాకా మంచి ఎంటర్ టైనర్. ఫ్యామిలీ సినిమా. డైరెక్టర్ త్రినాధ్ రావు, రైటర్ ప్రసన్న స్టయిల్ లో వుండే మాస్ ఎంటర్ టైనర్. ఇకపై కూడా మంచి ఎంటర్టైన్మెంట్ వున్న సినిమాలనే చేస్తాను.
-మజాకా టీజర్ ముందే రిలీజ్ చేశాం. అది జనాల్లో వుంది. ట్రైలర్ కి కంటే ముందు సోమ్మసిల్లి పాట రిలీజ్ చేశాం, అది టాప్ ట్రెండింగ్ లో వుంది. మాకు రిలీజ్ డేట్ ముఖ్యం. దానికి అనుగుణంగానే పబ్లిసిటీ మెటీరియల్ విడుదల చేస్తూ వచ్చాం.
-పాట లైవ్ షూటింగ్ అన్నది ఐడియా అనిల్ సుంకరది. రిలీజ్ డేట్ కి తక్కువ టైం వుంది. ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు అనిల్ సుంకర ఆ ఆలోచన చెప్పారు. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
-ఖచ్చితంగా చాలా మంచి సినిమా అవుతుంది. మంచి ఎంటర్ టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్ వున్న సినిమా. ఇంటర్వెల్ కి మంచి ట్విస్ట్ వుంటుంది. అది సెకండ్ హాఫ్ ని ఎలా లీడ్ చేస్తోందో చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. సందీప్ రీతు లవ్ స్టొరీ, అలాగే రావు రమేష్ అన్షు ట్రాక్ కూడా చాలా బావుంటుంది. సందీప్ కి భైరవ కోన కంటే బెటర్ సినిమా అవుతుంది.
-చాలా హ్యాపీ. ఈ సినిమాని ప్రాఫిట్స్ లో రిలీజ్ చేస్తున్నాను. సందీప్ కిషన్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్.
-నా ఫ్రెండ్స్, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా చూపించాం. ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ చాలా బావుందని చెప్పారు. పాటలు చాలా ఎంజాయ్ చేశారు. నేను ఏదైతే నమ్మానో అది వర్క్ అవుట్ అయ్యింది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
మీరు చెప్తే ఎలా మేము చెప్పాలి