సీఎం బాబు చీఫ్ పీర్వోగా ఆలూరి ర‌మేశ్‌

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి చీఫ్ పీఆర్వోగా జ‌ర్న‌లిస్ట్ ఆలూరి ర‌మేశ్ నియ‌మితుల‌య్యారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి చీఫ్ పీఆర్వోగా జ‌ర్న‌లిస్ట్ ఆలూరి ర‌మేశ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ రాజకీయ విభాగ‌పు ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ముకేశ్‌కుమార్ మీనా ఉత్త‌ర్వులు ఇచ్చారు. ఈ నియామ‌కం గ‌త ఏడాది జూన్ 13 నుంచి అమ‌ల్లో ఉన్న‌ట్టు భావించాల‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు.

ఆలూరి ర‌మేశ్ 2002 ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం విద్యార్థి. ఆ ఏడాది ఆ ప‌త్రిక పునఃప్రారంభం నేప‌థ్యంలో యువ జ‌ర్న‌లిస్టుల‌ను జ‌ర్న‌లిజం పాఠ‌శాల‌కు ఎంపిక చేసుకుంది. నాడు జ‌ర్న‌లిజం కాలేజీ ప్రిన్సిప‌ల్ క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి నేతృత్వంలో శిక్ష‌ణ పొందిన చాలా మంది జ‌ర్న‌లిస్టులు ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌లు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఈ క్ర‌మంలో అలూరి ర‌మేశ్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌లో రిపోర్టింగ్ విభాగంలో తెలుగుదేశం బీట్ చూసేవారు. దీంతో చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌తో స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌డ్డాయి. స‌ద‌రు ఛానెల్ యాజ‌మాన్యంతో టీడీపీకి విభేదాలున్న‌ప్ప‌టికీ, జ‌ర్న‌లిస్టుగా ఆ పార్టీ పెద్ద‌ల‌కు ఆత్మీయుడ‌య్యారు. ఆ ర‌కంగా సీఎంకు సీపీఆర్వోగా నియ‌మితుల‌య్యారు.

ఇప్ప‌టికే లోకేశ్ ప‌ర్స‌న‌ల్ పీఆర్వోగా జ‌ర్న‌లిస్ట్ చైత‌న్య‌రెడ్డి విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేశ్‌కు మీడియా ప‌రంగా చైత‌న్య పోషించిన పాత్ర అభినంద‌న‌లు అందుకుంది.

5 Replies to “సీఎం బాబు చీఫ్ పీర్వోగా ఆలూరి ర‌మేశ్‌”

Comments are closed.