రాజ‌కీయ బ‌త‌క నేర్చ‌ని జీవి

తానో, ఆ అధికారో ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం చంద్ర‌బాబునాయుడి ద‌గ్గ‌ర జ‌రిగిన పంచాయితీలో జీవీరెడ్డి మ‌న‌సు నొచ్చుకున్న‌ట్టుంది.

ప‌ద‌వి కోసం ఎన్ని అడ్డ‌దారులు తొక్క‌డానికైనా సిద్ధంగా ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో, దాన్ని ఖాత‌రు చేయ‌ని వాళ్లు కూడా ఉంటార‌ని ఏపీ ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ జీవీరెడ్డి నిరూపించారు. త‌ద్వారా రాజ‌కీయంగా తాను బ‌త‌క‌నేర్చ‌ని నాయ‌కుడ‌ని నిరూపించుకున్నారు. వ‌య‌సులో చిన్న వాడైన‌ప్ప‌టికీ, పెద్ద నిర్ణ‌య‌మే తీసుకున్నారు. త‌న సంస్థ ఎండీ , ఐఏఎస్ అధికారి దినేష్‌కుమార్ తీరు న‌చ్చ‌క మీడియా ముందుకొచ్చి, తాను న‌మ్మిన వాస్త‌వాల్ని బ‌య‌ట పెట్టారు.

తానో, ఆ అధికారో ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం చంద్ర‌బాబునాయుడి ద‌గ్గ‌ర జ‌రిగిన పంచాయితీలో జీవీరెడ్డి మ‌న‌సు నొచ్చుకున్న‌ట్టుంది. అవినీతి అధికారితో స‌ర్దుకుపోవాల‌ని సాక్ష్యాత్తు సీఎం సూచించ‌డం జీవీరెడ్డికి రుచించ‌లేదు. దీంతో తానే బ‌య‌టికి రావ‌డం మ‌ర్యాద అని ఆయ‌న భావించిన‌ట్టున్నారు.

ప్ర‌ముఖ ఎడిట‌ర్‌, దివంగ‌త కేఎన్‌వై ప‌తంజ‌లి గెలుపు స‌రే…బ‌త‌క‌డం ఎలా? అనే అద్భుత పుస్త‌కంలో పేర్కొన్న గ్రీకు సామెత ఈ సంద‌ర్భంగా గుర్తుకు రావ‌డం స‌హ‌జం.

“ముందు బ‌త‌క‌డం నేర్చుకో, ఆ త‌ర్వాత నీతిగా బ‌త‌కొచ్చు” అనే గ్రీకు సామెత‌ను ప‌తంజ‌లి ఆ పుస్త‌కంలో ప్ర‌స్తావించారు.

అధికార ల‌క్ష‌ణాలేవీ ఒంట‌బ‌ట్ట‌క‌పోవ‌డంతోనే జీవీరెడ్డికి ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వి మూణ్ణాళ్ల ముచ్చ‌టైంది. సంపాదించుకోడానికి అధికారం, అందులోనూ త‌న‌కు ద‌క్కిన ప‌ద‌వి కామ‌ధేనువు లాంటిది అయిన‌ప్ప‌టికీ, ఎందుకో గానీ అత‌ను ఆ చ‌ట్రంలో ఇమ‌డ‌లేక‌పోయారు.

దీంతో త‌న‌కు అధికార వ్య‌వ‌స్థ‌, అలాగే వాళ్ల‌కు తాను అడ్డ‌మ‌ని చాలా త్వ‌ర‌గానే అత‌ను గ్ర‌హించారు. దీంతో రెండో విడ‌త‌లో ద‌క్కిన ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వికి, అలాగే టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి రాజ‌కీయ సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈ మేర‌కు రాజీనామా లేఖ‌ను సీఎం చంద్ర‌బాబుకు పంపారు. టీడీపీ శ్రేయ‌స్సును కాంక్షిస్తూనే, ఇక‌పై రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని రాజీనామా లేఖ‌లో తెలిపారు.

మ‌రోవైపు ప్ర‌భుత్వంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ నేత‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌నే ప్ర‌చారానికి జీవీరెడ్డి రాజీనామా బ‌లం క‌లిగిస్తోంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డానికి జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, గ‌తంలో జీవీరెడ్డి ఏ పోరాట‌మైతే చంద్ర‌బాబుకు న‌చ్చిందో, నేడు అధికార ప‌క్షంలోకి వ‌చ్చిన త‌ర్వాత అదే రుచించ‌క‌పోవ‌డం రాజ‌కీయ విషాదం.

25 Replies to “రాజ‌కీయ బ‌త‌క నేర్చ‌ని జీవి”

  1. Deeply disappointed, చంద్రబాబు ఇతన్ని వదులుకోకూడదు. లేకపోతే పార్టీకి చాలా నష్టం.

  2. వెల్ డన్ జీవీ రెడ్డి గారు..

    చంద్రబాబు, లోకేష్ తప్పు చేశారు.. అధికారులకు స్వేచ్ఛ నివ్వడం లో తప్పు లేదు.. గాని జగన్ రెడ్డి పెంచుకొనే కుక్కలకు కూటమి ప్రభుత్వంలో స్థానం ఉండకూడదు..

    మిమ్మల్ని వదులుకోవడం టీడీపీ కి నష్టం..

    లోకేష్ మిమ్మల్ని వదులుకోరని నాకు తెలుసు.. త్వరగా ఈ సమస్య ని క్లియర్ చేసుకుని.. రెట్టించిన ఉత్సాహం తో రావాలని కోరుకొంటున్నాను..

    1. Jaganreddy ఒక త్రాష్టుడు. అందులో ఏటువంటి అనుమానము లేదు. చంద్రబాబు ఒక చేతకాని వెన్నెముకలేని చవట. ఎదో development వరకు చేస్తాడు కాని, ఒక్క ఆఫీసర్ నీ కూడా కంట్రోల్ చేయలేని సన్నాసి. పోలీసులు వినరు, ఐఏఎస్ లు వినరు, సీఐడీ వాళ్ళు వినరు వీడిమాట ఎవరు వినరు. మళ్ళి మొదట్నుంచీ ఒకటే చెత్త రాజకీయం, ఎవరన్నా బాగా పైకి వస్తున్నారు ఆంటే భయపడి చస్తాడు. GV Reddy, Pattabhi, AB Venkateswara Rao ఇలాంటి వాళ్లకు మంచి అవకాశాలు ఇవ్వాలి. ఇలాంటి చేతకాని వాడిని నమ్ముకోవద్దు అని మా అందరికీ ఎలక్షన్స్ ముందే తెలుసు, కాని గతిలేక vote వేసాము. గెలిచిన తరువాత వీడి కుక్క బుద్ది చూపించాడు. Fibernet లో 400 మందిని తీసేస్తే వాళ్ళకి salaries pay చేసిన ఆ ias నీ నిలబెట్టి అడగాలి, కాని దానికి reverse చేశాడు చేతకాని సన్నాసి.

  3. జేసీ దివాకర్ రెడ్డి, ఆది నారాయణ రెడ్డి కలిసిపోయినట్టు,

    కోటంరెడ్డి, నారాయణ కలిసిపోయినట్టు,

    కూన రవి కుమార్, అచ్చేమ్ నాయుడు కలిసి పోయినట్టు… వాటాలు వేసుకోవాలి, పంచుకోవాలి…

    అదే అదే adjust అవ్వాలి… అంతే గానీ, అవినీతిని పెకిలిస్తా…. సంస్థ ని పెంచుతా అంటా… ఎలా. ?

    ఆ పార్టీ హిస్టరీ లో ఎక్కడైనా ఈ ఒక్క సంస్థనైనా బాగు చేసిన హిస్టరీ ఉందా? ఎన్నో ప్రభుత్వ కంపెనీ లు ముంచారు… ఎన్నో సిస్టం ని ఆర్గనైజ్డ్ గా నాశనం చేశారు… అదే ఇక్కడ కూడా ఫాలో అయ్యారు…

    1. సజ్జల కి వీసా కి గొడవొచ్చి తప్పుకుపోలేదా ..పేటి పార్టీ లోని ఉంటాయి…ఇలాంటివి ఉండే వాళ్ళు ఉంటారు ..నచ్చని వాళ్ళు ఉండరు..కనీసం ఆయన తనకి నచ్చింది చేసారు..పదవి ని కూడా చూడకుండా..

  4. ఆలోచించాల్సిన విషయం. ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారం లో ఉంటారు ఇలాంటి తప్పులన్నీ కుప్పలుగా పేరుకుపోతే ?

  5. అమ్మనాబూతులు తిట్టిన చింతమనేని ముద్దు అయ్యాడు. కేవలం మన పచ్చ మీడియా లో “చంద్రబాబు అసహనం” అని రాయించి సరిపెట్టారు. అదీ వాడు తిట్టిన వీడియో వైరల్ అయ్యింది కాబట్టి.

    రాష్ట్రానికి ఏదో మంచి చేద్దాం, ప్రభుత్వానికి డబ్బులు మిగులుద్దాం అనుకున్న ఈయన్ని సాగనంపారు. పాపం ఈయనకి ఇంకా తెలుగుదేశం తాలుకు రాజకీయాలు ఒంటబట్టినట్లు లేవు. ముక్కుసూటిగా పోయాడు. చేతిగా మట్టి అంటకుండా జేబులు నింపుకునే తెలివి లేనివాడు పచ్చ పార్టీలో పనికిరాడు.

  6. ప్రభుత్వం లో అధికారం అనేది, ముక్కు సూటిగా వుండే G v Reddy గారు లాంటి వారికి నప్పని వ్యవస్థ.

    రాజకీయాలు అనే కాదు, ఏ రంగం లో అయిన సరే సూటిగా వుండే వారికి లౌక్యంగా నటించడం చేతకాదు.

    సీతమ్మ వాకిట్లో వెంకటేష్ లాంటి మనిషి జీవి రెడ్డి గారు. తనకి మంచిది అనిపించేది మాత్రమే నమ్ముతారు, అది సొంత వాళ్ళకి కూడా కష్టం ఐనా సరే.

    అందుకే రోజు ఇన్ని ఇబ్బందులు.

    జీవీ రెడ్డి గారికి మంచి జరగాలి అని కోరుకుందాం.

  7. GV Reddy given master stroke to TDP…He clearly shown the corruption ..400+ members drawing salry to write comments/ crate content in the favour of TDP. Just they converted ITDP guys to AP fibernet contract employes.

  8. ఈ పదవికి టీడీపీ లో ఇంత కన్నా అర్హులు లేరా ? నిన్న గాక మొన్న వచ్చిన జీవీ రెడ్డి కి ఇవ్వకపోతే ఎప్పటినుంచో పార్టీ లో ఉన్న వాళ్ళకి ఇవ్వొచ్చు కదా

    1. ఇంతకుముందు అయితే ఉండేవాళ్లేమో.. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూసాకా ఈయన కన్నా అర్హులు లేరనే అనిపిస్తుంది

  9. కొత్తగా కొన్న కుక్క కి ఊ స్కోకొ అంటే ఎలా తోక ఊపుకుంటూ పరిగెత్తల అనే ట్రైనింగ్ కోసం మాంచి అయ్య ఏస్ కోసం చూస్తున్నారు.

    దనిష్ స్యూట్ అవుతాడా లేదా!

  10. GV రెడ్డి మరియు / నెల్లూరు రెడ్లు అందరూ పరువు కోసం టీడీపీ లోకి వచ్చారు…

    కానీ సీబీన్ ప్రభుత్వ అవినీతి అధికారులకు ఎలా మద్దతు ఇస్తున్నారో అస్సాలు నాకు అర్థం కాలేదు

    మేమూ 2029 నాటికి సెలవు తీసుకుని NoTAకి ఓటు వేయాలి అనిపిస్తోంది.

Comments are closed.