కొంతమంది హీరోల దగ్గర కొన్ని రూల్స్ పనిచేయవు. ఎంత ప్రయత్నించినా వర్కవుట్ కావు. అలాంటి హీరోల్లో ఒకడు ప్రభాస్. ఈ హీరో దగ్గర ఓ కండిషన్ పెట్టాడంట దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మరి ఆ కండిషన్ ఏంటో తెలుసా?
ప్రభాస్ ను బల్క్ కాల్షీట్లు కోరాడంట సందీప్. స్పిరిట్ సినిమా కోసం వరుసగా కాల్షీట్లు కావాలని, కంటిన్యుటీ మిస్సవ్వకుండా ఉండేందుకు ఈ పని చేయాలని కండిషన్ పెట్టాడంట. ఇది సాధ్యమయ్యే పనేనా?
ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్. రాజాసాబ్ సెట్స్ పై ఉంది. ఫౌజీ (వర్కింగ్ టైటిల్) కూడా షూటింగ్ నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో స్పిరిట్ కోసం బల్క్ కాల్షీట్లు కోరడం అత్యాశే అవుతుంది.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఇప్పటికే కాస్త సన్నబడ్డాడు. చేయబోయేది పోలీస్ పాత్ర కాబట్టి, దానికి తగ్గట్టు ఫిజిక్ ను మార్చుకుంటున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ కొత్త లుక్ ఫొటోలు కూడా బయటకొచ్చాయి. మరోవైపు ప్రభాస్ పోలీస్ గెటప్ ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐలో జనరేట్ చేస్తూ చాలా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ఆలస్యమైంది. లెక్కప్రకారం గత నెల్లోనే సినిమా షూట్ ప్రారంభం కావాలి. ఈ వేసవిలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. సినిమాకు సంబంధించి చాన్నాళ్ల కిందటే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టిన దర్శకుడు, తాజాగా నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేశాడు.
Ee langa chesindi ye langa films malli hype okati
Thoka vundi articles vadalaku
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Chudam
Call me