పవన్ కల్యాణ్ కు నెలకు రూ.50 కోట్లు

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కొత్త విమర్శ అందుకుంది వైసీపీ.

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కొత్త విమర్శ అందుకుంది వైసీపీ. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ను, అలా ప్రశ్నించకుండా ఉండేందుకు నెలకు 50 కోట్ల రూపాయల్ని చంద్రబాబు ఇస్తున్నారని ఆరోపించింది.

“ప్రశ్నిస్తానంటూ సొల్లు కబుర్లు చెప్పిన పవన్ కల్యాణ్ ఎక్కడున్నారో తెలియదు. ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోయిందో చెప్పాలి. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు కలిసి పవన్ కల్యాణ్ కు నెలకు 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారంట. 50 కోట్లు ఇస్తూ ఏం చేసినా ప్రశ్నించకు అని అడిగారంట. అందుకే పవన్ నోరు మూగబోయిందంట.” స్వయంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శ ఇది.

పవన్ కల్యాణ్ విషయంలో ఇన్నాళ్లూ వైసీపీ చూసీచూడనట్టుంది. ఎక్కువగా చంద్రబాబు, లోకేష్ పైనే విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. కొంతమంది నేతలు పవన్ పై విమర్శలు చేయాల్సి వచ్చినా సోషల్ మీడియాకే పరిమితమయ్యారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తొలిసారి పవన్ పై కొత్త తరహా విమర్శలు అందుకున్నారు. ఇప్పటివరకు పవన్ పై ఎవ్వరూ చేయని ఆరోపణ ఇది. దీనిపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

19 Replies to “పవన్ కల్యాణ్ కు నెలకు రూ.50 కోట్లు”

  1. వాడేదో వాగడం నువ్వు రాయడం ఆఖరికి నీ పరిస్థితి ఇలా తయారయ్యింది జిఏ

  2. 😂😂😂😂…..pawan kalyan meeda ilanti neechamaina allegations cheyadaniki yevaru munduku raavatledu ani chivaraku ee duvvena help thesukunnara GA….👌👌…EXCELLENT LEKI STRATEGY GA…

  3. pk garini ella D grade chesi meeku vachina seats 11….so …think chesi news rayadam nerchukondi mr GA……..AALANE PAPER CHUSI CHADAVADAM NERPINCHANDI……MEE LEADER KI…..MEELAGA NENE YEVARNI CRITICISE CHEYADAM LEDU …NIJANI CHEPTHUNNANU….YCP DUVVADA SRINIVASU…GUNCHI PUBLIC LO DISCUSSION CHESTE CHEPPULU TEESI KODATARU….ALANTI CHARACTER LESS FELLOW PK LANTI NIJAITHI PARUDU GUNCHI MATLADU TE…

  4. దువ్వాడ అసలైన వైసీపీ కార్యకర్త..అస్సలుతగ్గొద్దు

    ఈసారి జీరోనే వైసీపీki తగ్గేదేలే..

  5. మన వెనకటి రెడ్డి గారే ఆ 5o కోట్లు డబ్బు వీపు మీద మోసుకుంటూ వెళ్లి ప్రతి నేల ఇస్తున్నారు లాగ వింది,

    కదా గ్రేట్ ఆంద్ర.

    కూలీ ఎంత, ఆ గోతాం మోసినందుకి? జగన్ కూడా ఖాళీగా వున్నాడు కదా, ఈ నెల ఆ కూలీ పని అతనికి ఇస్తే సరి..

Comments are closed.