అఖండ అక్టోబర్ 13న..?

టాలీవుడ్ లో ప్రొడక్షన్ లో వున్న మోస్ట్ ఇంట్రస్టింగ్ కాంబినేషన్లలో అఖండ ఒకటి. బాలయ్య-బోయపాటిల కాంబినేషన్ లో మూడో సినిమా. ఈ సినిమా విడుదల అక్టోబర్ 13న వుంటుందని వినిపిస్తోంది.  Advertisement ఈ సినిమా…

టాలీవుడ్ లో ప్రొడక్షన్ లో వున్న మోస్ట్ ఇంట్రస్టింగ్ కాంబినేషన్లలో అఖండ ఒకటి. బాలయ్య-బోయపాటిల కాంబినేషన్ లో మూడో సినిమా. ఈ సినిమా విడుదల అక్టోబర్ 13న వుంటుందని వినిపిస్తోంది. 

ఈ సినిమా మీద మాంచి అంచనాలు వున్నాయి. దసరా సీజన్ కు విడుదల అవుతుందని మొదటి నుంచీ వినిపిస్తున్నదే. అయితే అక్టోబర్ 8న, అక్టోబర్ 15న అన్నది క్లారిటీ లేదు. 

మెగాస్టార్ ఆచార్య ఎప్పుడయితే రాదు అని పక్కాగా వార్తలు వినిపించాయో అప్పటి నుంచి వేరే సినిమాల డేట్ లు రావడం ప్రారంభమైంది. క్రిష్-వైష్ణవ్ తేజ్ ల కొండపొలం, అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ ల బ్యాచురల్ సినిమాలు అక్టోబర్ 8న ఫిక్స్ అయిపోయాయి. 

దిల్ రాజు బ్రదర్ శిరీష్ తనయుడి తెరంగ్రేటం సినిమా రౌడీ బాయ్స్ అక్టోబర్ 15న ఫిక్స్ అయింది. అలాగే 13న శర్వా-అజయ్ భూపతి ల మహాసముద్రం డేట్ వచ్చేసింది.

ఇలాంటి నేపథ్యంలో అఖండ డేట్ మీద అనుమానాలు వినిపించాయి. అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే అక్టోబర్ 13న అఖండ రాబోతోంది. ఇది ఫిక్స్. మహా సముద్రం వెనక్కు వెళ్లే అవకాశం వుంది. ఈ మేరకు మాటలు జరిగినట్లు తెలుస్తోంది.