అఖండ ముందు సామాన్యుడు తేలిపోయాడు

ఏ పోటీకైనా సమఉజ్జీ ఉండాలంటారు. అది బుల్లితెరకు కూడా వర్తిస్తుంది. ఓవైపు పెద్ద సినిమా ఉన్నప్పుడు, దానికి పోటీగా మరో ఛానెల్ లో మరో పెద్ద సినిమా వేయడం సహజం. కానీ ఈసారి కాస్త…

ఏ పోటీకైనా సమఉజ్జీ ఉండాలంటారు. అది బుల్లితెరకు కూడా వర్తిస్తుంది. ఓవైపు పెద్ద సినిమా ఉన్నప్పుడు, దానికి పోటీగా మరో ఛానెల్ లో మరో పెద్ద సినిమా వేయడం సహజం. కానీ ఈసారి కాస్త తేడా కొట్టింది. సింహానికి పోటీగా కుందేలును దించారు. ఇంకేముంది సింహానికి కుందేలు ఆహారమైపోయింది. ఇక్కడ సింహం పేరు అఖండ. కుందేలు పేరు సామాన్యుడు.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో అఖండ సినిమాను టెలికాస్ట్ చేశారు. సరిగ్గా అదే టైమ్ లో జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సామాన్యుడు సినిమా వేశారు. దీంతో బాలయ్య సినిమా ప్రభంజనానికి, విశాల్ మూవీ పూర్తిగా చేతులెత్తేసింది. అఖండ సినిమాకు ఏకంగా 13 టీఆర్పీ రాగా.. సామాన్యుడు మూవీకి కేవలం 2.6 రేటింగ్ మాత్రమే వచ్చింది.

బాలకృష్ణ సినిమా బుల్లితెరపై సక్సెస్ అవ్వడం ఈమధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైమ్. ఆయన నటించిన రూలర్, ఎన్టీఆర్-కథానాయకుడు, జైసింహా, పైసా వసూల్ సినిమాలన్నీ బుల్లితెరపై ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు అఖండ సినిమాతో స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటాడు బాలయ్య.

అటు విశాల్ మాత్రం తన ఫెయిల్యూర్ ట్రాక్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ హీరో సినిమాలకు టీవీల్లో మంచి రేటింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా పోయింది. తాజాగా వచ్చిన విశాల్ సినిమాలేవీ బుల్లితెరపై కూడా క్లిక్ అవ్వడం లేదు. సామాన్యుడు మూవీ కూడా ఇప్పుడా లిస్ట్ లోకి చేరిపోయింది.