cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పదేళ్లుగా అఖిల్ దాచిపెట్టుకున్న ఫొటో ఇదే!

పదేళ్లుగా అఖిల్ దాచిపెట్టుకున్న ఫొటో ఇదే!

అఖిల్ అక్కినేనికి నాగార్జున అంటే చాలా ఇష్టం. తాత ఏఎన్నార్ అంటే ఇంకా ఇష్టం. మరి తాతకు సంబంధించి అఖిల్ ప్రతిరోజూ గుర్తుచేసుకునే జ్ఞాపకం ఏంటి? ఏఎన్నార్ ఫొటోల్లో అఖిల్ కు ఏదిష్టం. దీనికి సమాధానంగా తన ఫోన్ వాల్ పేపర్ చూపించాడు అఖిల్. తాతకు సంబంధించి ఆ ఫొటో అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

"నేను నా ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే ఫొటో ఇదే. పదేళ్ల నుంచి ఇదే ఫొటో చూస్తున్నాను. మా తాతగారికి సంబంధించి నాకు ఇష్టమైన స్టిల్ ఇది. ఏ ఫోన్ మారినా, ఈ లాక్ స్క్రీన్ మాత్రం అలానే ఉంటుంది. ఇది నాకు అలవాటైపోయింది. నేను ఈ ఫొటో మార్చను. ఇది నా ఫేవరెట్ స్టిల్. నిజానికి ఇది సినిమాలో స్టిల్ కాదు, తాతయ్యను ఆడిషన్ చేసినప్పుడు లుక్ టెస్ట్ కోసం తీసిన ఫొటో ఇది. ఎందుకో బాగా నచ్చేసింది. పదేళ్ల నుంచి అలా ఉండిపోయింది."

ఇలా తాతయ్యకు సంబంధించి తన ఇష్టాన్ని బయటపెట్టాడు అఖిల్. ఇప్పటివరకు ఈ విషయాన్ని తను ఎక్కడా షేర్ చేయలేదన్నాడు. ఇక నాగార్జునకు ఉన్న మన్మధుడు ట్యాగ్ లైన్ పై స్పందిస్తూ.. ఏన్నేళ్లయినా అది తన తండ్రికే ఉంటుందని.. ఆ ట్యాగ్ లైన్ తనకు వద్దంటున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ హీరో.. ఆ సినిమాలో తను కామెడీ చేయలేదని, తనపై కామెడీ నడుస్తుందని చెప్పుకొచ్చాడు.

"పూజా హెగ్డే కామెడీ చేస్తుంది. నేను కామెడీ అయిపోతాను. సినిమా మొత్తం నేను కామెడీ అయిపోతాను. పూజా హెగ్డే పాత్ర చాలా పెద్దది. ఆమె స్టాండప్ కమెడియన్ గా చేసింది. ఆమె కెరీర్ లోనే మంచి క్యారెక్టర్స్ లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది."

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత గీతాఆర్ట్స్ బ్యానర్ పై మరో సినిమా చేస్తానని ప్రకటించాడు అఖిల్. ఈసారి తనే ఓ మంచి కథ తీసుకొని అల్లు అరవింద్ ను కలుస్తానని అన్నాడు.

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×