అఖిల్..ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

బ్యాచులర్ తరువాత హీరో అఖిల్ చేస్తున్న సినిమా ఏజెంట్. అఖిల్ కెరీర్ లోనే కాస్త భారీ బడ్జెట్ సినిమా ఇది. దర్శకుడు సురేందర్ రెడ్డి. నిర్మాత అనిల్ సుంకర. అఖిల్ మీద ఇంత భారీ…

బ్యాచులర్ తరువాత హీరో అఖిల్ చేస్తున్న సినిమా ఏజెంట్. అఖిల్ కెరీర్ లోనే కాస్త భారీ బడ్జెట్ సినిమా ఇది. దర్శకుడు సురేందర్ రెడ్డి. నిర్మాత అనిల్ సుంకర. అఖిల్ మీద ఇంత భారీ బడ్జెట్ నా ఎలా వర్కవుట్ అవుతుంది? అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసారు. అందుకే సినిమాలో డైరక్టర్ కూడా భాగస్వామి అని కూడా గుసగుసలు వినిపించాయి.

అయితే అసలు సంగతి ఇప్పుడు వినిపిస్తోంది. ఓ మాంచి భారీ సినిమా తనకు అవసరం అనే ఆలోచనతో హీరో అఖిల్ ఈ సినిమాను రెమ్యూనిరేషన్ లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలై మంచి హిట్ అయి లాభాలు వస్తే అప్పుడు చూసుకుంటారు. ప్రస్తుతానికి అయితే అఖిల్ కు రెమ్యూనిరేషన్ లేదు.

అలాగే సురేందర్ రెడ్డి కూడా భాగస్వామ్యం వదిలేసి, తక్కువ రెమ్యూనిరేషన్ తో ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. నాపేరు సూర్య లాంటి అరివీర డిజాస్టర్ తరువాత పక్కన వుండిపోయిన రచయిత, దర్శకుడు వక్కంతం వంశీనే ఈ సినిమాకు కథకుడు.

కొంత సినిమా తీసిన తరువాత స్క్రిప్ట్ సరిగ్గా లేదని ఇప్పుడు మళ్లీ వంటకం మొదలుపెట్టారు. అందుకోసం దర్శకుడు సురేందర్, రచయితే వక్కంతం వెళ్లి బాపట్ల బీచ్ రిసార్ట్ లో కథా చర్చలు సాగిస్తున్నట్లు బోగట్టా.