ఓవర్సీస్ లో కొంత మంది డైరక్టర్లకు, కొంత మంది హీరోలకు మంచి క్రేజ్ వుంటుంది. ఆ దర్శకుల సినిమాలంటే కొన్ని అంచనాలు వుంటాయి. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, సుకుమార్ లాంటి వాళ్ల సినిమాలంటే ఓవర్ సీస్ లో ఓ క్రేజ్ వుంటుంది. అందుకే ఇప్పటి వరకు సుకుమార్ సినిమాలు వన్ మిలియన్ మార్క్ దాటిన వాటి సంఖ్య నాలుగుకు చేరింది.
బన్నీ కూడా తక్కువేమీ కాదు. త్రివిక్రమ్ తో కలవడంతో నాన్ బాహుబలి రికార్డే యుఎస్ లో బన్నీ పేరు మీద వుంది. పుష్ప కూడా వన్ మిలియన్ దాటేసింది. ఆ విధంగా సుకుమార్-బన్నీ కాంబినేషన్ అంచనాను కొంత వరకు నిలబెట్టుకుంది. కానీ అక్కడితో ఆగితే సరిపోదు. పుష్ప సినిమాను కాస్త ఎక్కువ రేట్లకే మార్కెట్ చేసారు. బ్రేక్ ఈవెన్ కావాలంటే రెండు మిలియన్లు దాటి ఎక్కువే చేయాలి.
బన్నీ ఆ మార్కు దాటిన ఫీట్ మరోసారి చేయగలిగితే చెప్పుకోదగ్గ సంగతే. ఎందుకంటే ఓవర్సీస్ ఆడియన్స్ టెస్ట్ ప్రకారం తీసిన సినిమా కాదు పుష్ప. ఇక్కడ ఎంత మాస్ సినిమా అయితే అంత క్రేజ్. కానీ ఓవర్ సీస్ లో ఎంత క్లాస్ అయితే అంత క్రేజ్. బాలయ్య అఖండ మినహాయింపు అనుకోండి.
అందుకే పుష్ప ఏ రేంజ్ కు ఓవర్సీస్ లో వెళ్తుంది అనే దాని మీద అందరి చూపూ వుంది.