తొందరపడుతున్న సంపత్ నంది

అటు చూస్తే బాదం హల్వా..ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ అంటాడు శ్రీశ్రీ. అలాగే వుంది. దర్శకుడు సంపత్ నంది పరిస్థితి. సీటీమార్ తో కాస్త తేరుకున్న సంపత్ నందికి పెద్ద బ్యానర్ల నుంచి అడ్వాన్స్…

అటు చూస్తే బాదం హల్వా..ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ అంటాడు శ్రీశ్రీ. అలాగే వుంది. దర్శకుడు సంపత్ నంది పరిస్థితి. సీటీమార్ తో కాస్త తేరుకున్న సంపత్ నందికి పెద్ద బ్యానర్ల నుంచి అడ్వాన్స్ లు అందాయి. అయితే హీరోలు ఎవ్వరూ రెడీగా లేరు. 

బాలయ్య బాబుకు కథ చెప్పాలని ఓ ప్రయత్నం. ఆయన అఖండ సినిమా ప్రమోషన్లు, ఆహా అన్ స్టాపబుల్ లో బిజీగా వున్నారు. అయితే ఆయన ఓకె అన్నా కూడా కనీసం ఏడాది వెయిటింగ్ లో వుండాలి. అనిల్ రావిపూడి-గోపీచంద్ మలినేని సినిమాలు పూర్తయిన తరువాతే అవకాశం.

పోనీ ఈ లోగా ఏవరితో అయినా చేద్దాం అని చూస్తే సాయి ధరమ్ తేజ్ మాత్రమే ఆప్షన్ గా వున్నారు. ఆయన కూడా ఇంకా సెట్ మీదకు రావడానికి కనీసం రెండు నెలలు పడుతుందని బోగట్టా. అలా వచ్చాక కూడా రెండు సినిమాలు ఫినిష్ చేయాల్సి వుంది.  బాలయ్య నా- సాయి ధరమ్ నా? ఇదీ సంపత్ నంది సమస్య.

నిజానికి ఈ సమస్య చాలా మంది డైరక్టర్లకు వుంది. సినిమాలు యావరేజ్ అయినా, హిట్ అయినా హీరోలు ఎవ్వరూ అందుబాటులో లేరు. నిర్మాతలు కుప్పలు తెప్పలుగా రెడీగా వున్నారు. టాలీవుడ్ పరిస్థితి ఇదీ.