ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు భారత్ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. 'నా హృదయం.. పౌరసత్వం.. రెండూ హిందుస్థానీ. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ ట్వీట్టర్లో భారత్ పౌరసత్వాని సంబంధించిన పత్రాలు పోస్ట్ చేశారు.
2017లో 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రం ప్రమోషన్ల సమయంలో తాను కెనడా పౌరసత్వం కలిగి ఉన్న, విషయాన్ని అక్షయ్ బయటపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు వచ్చాయి. అలాగే 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని అక్షయ్ ఇంటర్వ్యూ చేసి భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
భారత్‌లో ఓటు లేని ఆయన భారత పౌరులను ఓటింగ్‌కు పిలుపివ్వడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు రావడంతో “తాను కెనడా పౌరసత్వం గురించి ఎప్పుడూ దాయాలనుకోలేదని, భారత్ అన్నీ ఇచ్చింది. ఇప్పుడు అనుభవిస్తున్నదంతా ఈ దేశం ఇచ్చిందే. నా దేశానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. భారత పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నా. అది రాగానే కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటా” అని వివరణ ఇచ్చారు.
కాగా 2019 తర్వాత అక్షయ్ భారత్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా ఎట్టకేలకు భారత్ పౌరసత్వం లభించింది. నిజానికి- అక్షయ్ కుమార్ పూర్తిస్థాయి భారతీయుడు కాదు. ఆయన కెనడియన్. కెనడా ప్రభుత్వం అందించిన పాస్‌పోర్ట్‌తోనే భారత్‌లో నివసిస్తోన్నారు. కొద్దిరోజుల కిందటే తన కెనడా పాస్‌పోర్ట్‌ను కూడా రెన్యూవల్ చేయించుకున్నారు. తాజాగా అక్షయ్ భారతీయుడుగా మారారు.