Advertisement

Advertisement


Home > Movies - Movie News

'అల' క్యారెక్టర్ లోకి బన్నీ

'అల' క్యారెక్టర్ లోకి బన్నీ

టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ నటుల్లో బన్నీ అందరి కన్నా ముందు వరుసలో వుంటాడు. ఏదో ఒకటి చేయాలని, నేర్చుకోవాలని, కొత్తగా ఏదో చేయాలని చూస్తుంటాడు. త్రివిక్రమ్ తో చేస్తున్న మూడో సినిమా లో కూడా బన్నీ ఈ విధమైన ఎఫెర్ట్ పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది బయటకు విడుదల చేసిన టీజర్ చూస్తుంటే. 

టీజర్ ఎలా వుంది? ఏ షాట్లు వేసారు? అవన్నీ పక్కన పెడితే, టీజర్ చివర్న విలన్ సముద్ర ఖనిని ఇమిటేట్ చేస్తూ..'నువ్వు ఇప్పుడే కారు దిగావ్..నేను ఇప్పుడు క్యారెక్టర్ లోకి ఎక్కా' అని చెప్పే సీన్ కానీ, టీజర్ మధ్యలో 'స్టయిల్ గా వుంది కదా? అందుకే నాకు నచ్చింది' అనే సీన్లో ఎక్స్ ప్రెషన్ లు కానీ భలేగా వున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?