cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సూపర్ స్టార్ జెట్ స్పీడ్.. మరో సినిమా లాంఛ్

సూపర్ స్టార్ జెట్ స్పీడ్.. మరో సినిమా లాంఛ్

దర్బార్ సినిమాను ఇలా పూర్తిచేసిన రజనీకాంత్,ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలా మరో సినిమా స్టార్ట్ చేశాడు. అవును.. ఈరోజు రజనీకాంత్ కొత్త సినిమా ప్రారంభమైంది.సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శివ. మొన్నటివరకు బ్యాక్ టు బ్యాక్  అజిత్ తో సినిమాలు చేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు రజనీకాంత్ ను మరింత మాస్ గా చూపించడానికి రెడీ అవుతున్నాడు.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.కెరీర్ లో రజనీకాంత్ కు ఇది 168వ సినిమా.

ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించనుంది. ఖుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించబోతున్నారు.గతంలో రజనీకాంత్ సరసన హీరోయిన్లుగా నటించారు ఖుష్బూ, మీనా. ఇప్పుడు అతడి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.