నిర్మాత అల్లు అరవింద్ కు ఓ సెంటిమెంట్ వుంది. తన ఫ్యామిలీ లో జనాలకు ముఖ్యంగా సిస్టర్స్ కు సినిమా చూపిస్తే మొహమాటం లేకుండా ఒపినీయన్ ఛెప్పేస్తారు. వాళ్ల మాట మీద వెళ్తే చాలు అన్నది ఆ సెంటిమెంట్. ఆ మేరకు ఆయన రాబోయే అల వైకుంఠపురములో సినిమాకు ఓ షో వేసేసారు.
అల్లు అరవింద్ భార్య, ఆయన సోదరి అయిన డాక్టర్ వెంకటేశ్వర రావు భార్య, బన్నీ సోదరుడు బాబీ తదితరులు సినిమా చూసారు. బన్నీ వైఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్ కావడంతో ఆమె చూడలేదని తెలుస్తోంది. చూసిన వాళ్లంతా అరవింద్ కు పాజిటివ్ రిపోర్టు యునానిమస్ గా ఇచ్చేసారని తెలుస్తోంది.
దాంతో ఇప్పుడు అల వైకుంఠపురములో ఫైనల్ వెర్షన్ లాక్ అయి పోయినట్లే. డిటీఎస్ మిక్సింగ్, ఇతరత్రా వ్యవహారాలు కూడా దాదాపు పూర్తయిపోయాయి. ఇవేవీకాకుండానే అల్లు వారి ఫ్యామిలీ రఫ్ వెర్షన్ చూసేయడం విశేషం. కేవలం అరవింద్ కు వున్న సెంటిమెంట్, ఫ్యామిలీ మెంబర్ల జడ్జిమెంట్ కోసం రఫ్ వెర్షన్ ను వారికి చూపించేసారు.