తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఆయన కంపెనీలు, ఆయన కంపెనీలో ముఖ్య ఉద్యోగుల ఇళ్లపై మంగళవారం సీబీఐ రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి.
హైదరాబాద్, గుంటూరు, విజయవాడల్లోని రాయపాటి నివాసాల్లో, ఆఫీసుల్లో, ఆయన వ్యాపారాల్లోని ముఖ్య అధికారుల ఇళ్లపై ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏక కాలంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు.
రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ మూడు వందల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసిన వ్యవహారంలో కేసులను ఎదుర్కొంటూ ఉంది.
ఇండియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు సాగుతున్నాయని సమాచారం. బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంలో గతంలోనే రాయపాటి మీద సీబీఐ కేసులు నమోదు అయ్యాయి.
రాయపాటి ఇంటితో పాటు.. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో ఇంటి మీదా, ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లో సైతం సీబీఐ తనిఖీలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.