‘అల’ ఇల్లు ఎవరిదో తెలుసా?

అల వైకుంఠపురములో సినిమాలో ఇల్లే కీలకం. 'వైకుంఠపురం రా అది' అంటాడు హీరో బన్నీతో తండ్రి మురళీ శర్మ. అలాంటి ఇల్లు ఇంటీరియర్ అంతా అన్నపూర్ణలో సెట్ వేసారు. కానీ బయట నుంచి కూడా…

అల వైకుంఠపురములో సినిమాలో ఇల్లే కీలకం. 'వైకుంఠపురం రా అది' అంటాడు హీరో బన్నీతో తండ్రి మురళీ శర్మ. అలాంటి ఇల్లు ఇంటీరియర్ అంతా అన్నపూర్ణలో సెట్ వేసారు. కానీ బయట నుంచి కూడా అంతకు అంతా అందమైన ఇల్లు కావాలి. ఎక్కడ దొరుకుతుంది. ముందు కొన్ని విదేశీ లోకేషన్లలో చూసారు. బయట నుంచి చూపిస్తే చాలు, ఒకటి రెండు షాట్ లు తీస్తే చాలు. 

ఆఖరికి అలాంటి ఇల్లు హైదరాబాద్ లోనే దొరికింది. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఎన్టీవీ అధినేత చౌదరి కూతురు రచన అత్తగారి ఇల్లు. ఎన్టీవీ చౌదరి వియ్యంకులు, హారిక హాసిని అధినేతలకు కూడా  బంధువులే. ఆ బంధుత్వంతో ఒకటి రెండు రోజులు బయట నుంచి షూట్ చేయడానికి, సినిమాలో ఆ బంగ్లా చూపించడానికి అనుమతి దొరకింది.

సుమారు 100 కోట్లతో కట్టిన ఇల్లు ఇది. ఈ ఇంటికి కోడలిగా వెళ్లిన ఎన్టీవీ చౌదరి కుమార్తె పెళ్లి ధూమ్ ధామ్ గా కోట్ల ఖర్చుతో చేసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఈ వివాహం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన అత్యంత ఖరీదైన వివాహాల్లో అది ఒకటిగా వార్తల్లో నిలిచింది. అలాంటి పెళ్లి జరిగిన అమ్మాయి అత్తింటి వారిల్లు ఆ రేంజ్ లో వుండడంలో ఆశ్చర్యమేముంది?