సుమారు 16 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్న హీరో గారిని మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే వెంటనే సమంత అని తడుముకోకుండా చెప్పాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా? ఇంకెవరండి హీరో శర్వానంద్.
తమిళంలో సక్సెస్ సాధించిన ‘96’ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. దిల్‌రాజ్ నిర్మాతగా, ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా ‘జాను’గా తెలుగు తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.
ఈ సినిమా విశేషాల గురించి హీరో శర్వానంద్ మీడియాతో పంచుకున్నాడు. అందమైన ప్రేమ కథ అంటూ ఆయన ఊహాలోకంలోకి వెళ్లిపోయాడు. ‘స్కూల్లో చిగురించిన ప్రేమ. ఆ తర్వాత 20 ఏళ్లకు వాళ్ళిద్దరు కలుసుకుంటారు. 1996లో స్కూల్ నాటి అనుభూతులను గుర్తు చేసుకుంటారు. హీరోయిన్‌గా సమంత ఆ పాత్రలో జీవిస్తారు. ఆమె ఎంత గొప్ప నటో దగ్గరగా చూసి తెలుసుకున్నాను. ఇప్పటి తరం హీరోయిన్‌లలో ఆమే మేటి’ అని శర్వానంద చెప్పుకుపోయాడు.
సమంత నటన కోసమైనా జాను సినిమా చూడాలని శర్వానంద్ మాటలు ఆసక్తి కలిగించాయి. ఇప్పటి తరం హీరోయిన్‌లలో సమంతను అగ్రస్థానంలో నిలబెట్టడంపై మిగిలిన హీరోయిన్ల అభిమానులు కాస్త అలిగేలా చేస్తున్నాయి.