Advertisement

Advertisement


Home > Movies - Movie News

అల వైకుంఠాపురంలో.. హిందీలో!

అల వైకుంఠాపురంలో.. హిందీలో!

రెండేళ్ల కింద‌ట విడుద‌ల అయిన అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠ‌పురంలో ఇప్పుడు హిందీలోకి డ‌బ్ అవుతూ ఉంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ నెల ఇర‌వై ఆరో తేదీన ఈ సినిమా హిందీ డ‌బ్డ్ వెర్ష‌న్ విడుద‌ల కాబోతోంది. 

పుష్ప సినిమా హిందీలో విడుద‌ల అనంత‌రం ఇప్పుడు ఈ పాత సినిమా వేగంగానే డ‌బ్ అయ్యి హిందీలో విడుద‌ల అవుతున్న‌ట్టుగా ఉంది.  

ఫ‌స్ట్ వేవ్ క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఈ సినిమా హిందీ రీమేక్ గురించి చ‌ర్చ‌లు జ‌రిగాయి. హిందీలో ఇద్ద‌రు హీరోల‌ను పెట్టి అల్లు అర‌వింద్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ త‌ర్వాత ఆ ప్రాజెక్టు అక్క‌డ చేతులు మారింది.   

ఒక‌వైపు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. ఇంకా షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ట్టుంది. మ‌రి ఇంత‌లో డ‌బ్బింగ్ వెర్ష‌న్ థియేట‌ర్లో విడుద‌ల ప్ర‌క‌ట‌న రావ‌డం గ‌మ‌నార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?