తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ఏకైక హీరో ఇవాళ నాన్ బెయిలబుల్ కేసులో అరెస్టు కావడం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న సంగతి. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. పుష్ప 2 పాన్ ఇండియా రేంజిలో.. చరిత్రలో లేని వసూళ్ల రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్.. ఇంకా పెంచిన రేట్లు అమల్లో ఉన్న రోజుల్లోనే.. సినిమా తాలూకు వేడి తగ్గక ముందే అరెస్టు కావడాన్ని దేశమంతా కూడా ఆసక్తిగా గమనిస్తోంది.
అల్లు అర్జున్ మీద నమోదైన కేసులు, వాటిలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండడం, నేరంలో ఆయన పాత్ర ఎంత ఉంది అనే చర్చలన్నీ పక్కన పెడితే.. ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతోంది. సినిమా సెలబ్రిటీలు అయినంత మాత్రాన.. వారిని ప్రత్యేకంగా చూసేదేం ఉండదని, చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ పోలీసు విస్పష్టంగా నిరూపించారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పరిస్థితే ఇలా ఉంటే.. హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సంగతేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన జాగ్రత్త పడాలని లేకపోతే అరెస్టు తప్పదని అంతా అనుకుంటున్నారు.
మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిచేసి కొట్టారు. టీవీ చానెల్ రిపోర్టరు చేతిలోని గన్ మైకును లాక్కుని అతనినే కొట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. దీనిపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. అయితే ఆరోజు ఘర్షణల్లో తనకు కూడా గాయాలయ్యాయంటూ ఆస్పత్రిలో చేరిన మోహన్ బాబు రెండు రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యారు. ఈలోగా హైకోర్టును ఆశ్రయించి ఆయన మీద తక్షణ చర్యలు ఉండకుండా ఉపశమనం పొందారు.
కానీ.. అల్లు అర్జున్ మీద కేసు విషయంలో తెలంగాణ పోలీసుల తీరు గమనిస్తోంటే.. మంచు మోహన్ బాబు పట్ల ఎలాంటి ఉపేక్ష ఉండదని అర్థమవుతోంది. ఆయనకు కూడా అరెస్టు గండం పొంచి ఉన్నదని అంతా భావిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు అనేది.. మోహన్ బాబు ముందే జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
గాయపడిన విలేకరి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయనను వెళ్లి కలవడం, క్షమాపణ కోరడం, తాను కొట్టడం ఉద్దేశపూర్వకంగా జరగలేదని.. పొరబాటు అని ముందే కోర్టుకు కూడా నివేదించడం.. తన వల్ల తప్పు జరిగింది గానీ.. ఉద్దేశపూర్వక చర్య కాదని ముందే వేడుకోవడం తరహాలో ఆయన మెట్టు దిగి వస్తే తప్ప అరెస్టు తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి మోహన్ బాబు.. తన మొండిపట్టునే ప్రదర్శిస్తారా? అరెస్టును తప్పించుకోవడానికి సామరస్య ధోరణి అవలంబిస్తారో వేచిచూడాలి.
Bokkalo vesi dengandi ee AATHU gaadu ni 😂 National award return teesukovali okari dead ki reason ayinduku
నిజ జీవితంలో కూడా సినిమా లు చూపిస్తున్నారు ఈ లివింగ్ లెజెండ్ లు
kharma.. phalitham…
L
అల్లు అర్జున్ అరెస్టు కరెక్ట్ కాదు. తెలిసో తెలియకో తప్పు జరిగింది వాళ్ళు కూడా బాధపడుతున్నారు. Compensation కూడా ఇచ్చారు. ఇప్పుడు 14 రోజుల అంటున్నారు. ఇది వేరొకరి ప్రోద్బలం వల్ల అని అనుమానం.
ఆర్జీవీ సినిమాకి ఇంకో కథ దొరికింది…
దానికి ‘భక్త (వత్సల) చరిత్ర’ అని పేరు పెడతాడేమో
Sandhya theater Scenario doesn’t apply. That was public function without permissions..
moha Babu scenario, private, media barging into private home without permission and keeping Mike when emotions are at play.