ఈటీవీలో ఆలీతో సరదాగా షో కి మంచి క్రేజ్ నే వుంది. ఎందుకంటే ఆలీతో వున్న అనుబంధంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు ఆ షో కి వచ్చారు బయట ఇంటర్వూలు ఇవ్వడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయని వారు కూడా ఆలీ షో కి హాజరయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, అల్లు అరవింద్, మోహన్ బాబు ఇలాంటి రేర్ ఇంటర్వూలు ఆలీ చేసారు. సరదా సరదా ఇంటర్వూలు అనేకానేకం. మొత్తం మూడు వందలకు పైగా ఇంటర్వూలు ఈ షో లో ఆలీ చేసారు.
వారం వారం వచ్చే సినిమాల కోసం కొన్ని చేసారు. తన కోసం కొన్ని చేసారు. మొత్తం మీద ఆలీతో సరదాగా బానే సరదాగా సాగుతూ వస్తోంది. అలాంటి షో లోకి వున్నట్లుండి యాంకర్ సుమ వచ్చారు. ఆమె వచ్చింది ఆలీతో మాటా మంతీ కోసం కాదు. ఆలీ ని ఇంటర్వూ చేయడానికి. అది కూడా ఆలీతో సరాదాగా షో లో.
అదే గమ్మత్తు. మంచు లక్ష్మితో స్టార్ట్ అయిన షో సుమ రివర్స్ ఇంటర్వూతో ముగిసింది. త్వరలో మరో మంచి షో తో మీ ముందుకు వస్తా అని ఆలీ అన్నారు కానీ వస్తారా? అన్నది అనుమానం? అసలు 300 ఎపిసోడ్ ల తరువాత ఆలీతో సరదాగా ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అన్నది అనుమానం. ఎందుకంటే ఆలీతో సరదాగా షో అనేది సీజన్ ల వారీగా నడిచేది కాదు. పది లేదా ఇరవై ఎపిసోడ్ లు చేసి ఆపేసేది కాదు. అలా అయితే మూడు వందల ఎపిసోడ్ లు చేయరు కదా? పైగా టీవీ చానెళ్లలో ఇలా వందలాది ఎపిసోడ్ లు నడుస్తూనే వున్న షో లు అనేకం వున్నాయి కూడా.
ప్రభుత్వ పదవి చేపట్టానని ఆలీ నే ఆపారో మరేం జరిగిందో? మరి ఇప్పుడు ఈ బ్రేక్ అన్నది ఈ టీవీ కి ఆలీ కే తెలియాలి. మొత్తానిక ఆలీతో సరదాగా షో ముగిసింది. గౌరవ పూర్వకమైన ఫేర్ వెల్ ఆలీకి దక్కింది.