ఇటీవలే తనకు మానసికంగా పెళ్లి అయిపోయిన భావనే ఉందని చెప్పింది అలియా భట్. రణ్ బీర్ కపూర్ కపూర్ తో తనకు పెళ్లి అయిపోయినట్టుగా తన మెదడు భావిస్తుందని అలియా చెప్పుకొచ్చింది. కొన్నాళ్లుగా ప్రేమబంధంలో ఉన్న ఈ జంట సహజీవనంలో కూడా ఉన్నట్టుంది. ఈ క్రమంలో అలియా భట్ తమ పెళ్లి గురించి ఈ రకమైన ప్రకటన చేసింది.
ఇక తాజాగా రణ్ భీర్ గురించి మరోసారి స్పందించింది. తన జీవితంలో అతడెంతో ప్రత్యేకమైన వ్యక్తి అని అలియా భట్ వివరించింది. తను విపరీతంగా ప్రేమించేది తననేనని చెప్పింది. రణ్ బీర్ పై తనకు అంత ప్రేమ ఉండగా.. ఇక పెళ్లి గురించి పదే పదే ఆలోచించడం ఎందుకున్నట్టుగా అలియా స్పందించింది.
అయితే పెళ్లి విషయంలో రణ్ బీర్ పై ఒత్తిడి ఉన్నట్టుంది. రణ్ బీర్ ను పెళ్లి కొడుకుగా చూడాలని తను అనుకుంటున్నట్టుగా కీర్తి శేషుడైన అతడి తండ్రి గతంలోనే చెప్పారు. ఇలా పెళ్లిని రణ్ బీర్ కుటుంబం చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా ఉంది.
రణ్ బీర్ గతంలో కత్రినాతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా అతడి కుటుంబం నుంచి పెళ్లి విషయంలోనే ఎక్కువ ఒత్తిడి ఉందనే మాట వినిపించింది. కత్రినా మరొకరిని ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రణ్ బీర్ పెళ్లెప్పుడు? అనే మాట మీడియాలో తరచూ వినిపిస్తోంది.
అయితే అలియా మాత్రం మానసికంగా పెళ్లి అయిపోయినట్టే, అంత ప్రేమ ఉండగా పెళ్లి ఎప్పుడో ఒకప్పుడు చేసుకోవచ్చన్నట్టుగా స్పందిస్తోంది.