రణబీర్ కపూర్, అలియాభట్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని అలియాభట్ స్వయంగా వెల్లడించింది. త్వరలోనే మా బేబీ వస్తోంది అంటూ క్యాప్షన్ పెట్టి మరీ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది అలియా. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్ పై పడుకొని, కంప్యూటర్ మానిటర్ స్క్రీన్ పై తన గర్భాన్ని చూసుకుంటూ రణబీర్ తో కలిసి సంతోషపడుతున్న ఫొటోను అలియా షేర్ చేసింది.
దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకున్న రణబీర్, అలియా రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ లో వీళ్ల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కూడా ప్లాన్ చేయలేదు. ఎవరి సినిమా పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అలా పెళ్లి చేసుకొని 3 నెలలైనా తిరక్కముందే తన ప్రెగ్నెన్సీ కన్ ఫర్మ్ చేసింది అలియా భట్.
బాలీవుడ్ కు చెందిన చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతోంది. వాణికపూర్, రకుల్ ప్రీత్, ప్రియాంక చోప్రా, టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్.. ఇలా చాలామంది ప్రముఖులు రణబీర్-అలియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కతియావాడీ సినిమాలు చేసింది అలియా. రణబీర్ తో కలిసి ఆమె చేసిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.