మిక్స్ డ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయ్యాయంట

శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. అయితే ఎప్పట్లానే మరోవైపు విజయోత్సవ ర్యాలీలు, సక్సెస్ సంబరాలు మాత్రం జరుగుతున్నాయి. హిట్..హిట్..సూపర్ హిట్ అంటూ పేపర్లలో యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఓకే కానీ, ఆ…

శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. అయితే ఎప్పట్లానే మరోవైపు విజయోత్సవ ర్యాలీలు, సక్సెస్ సంబరాలు మాత్రం జరుగుతున్నాయి. హిట్..హిట్..సూపర్ హిట్ అంటూ పేపర్లలో యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఓకే కానీ, ఆ తర్వాత మేకర్స్ చెబుతున్న మాటలే కోటలు దాటుతున్నాయి.

మొన్నటికిమొన్న దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు లైన్లోకి వచ్చారు. తను తీసిన 7 డేస్ 6 నైట్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. దాన్ని ఏకంగా క్లాసిక్ మూవీ శంకరాభరణంతో పోల్చారు. శంకరాభరణం సినిమా విడుదలైన కొత్తలో ఫ్లాప్ అయిందట. ఆ తర్వాత మౌత్ టాక్ తో క్లాసిక్ అయిందట. 

తన సినిమాకు కూడా అలాంటి మౌత్ టాక్ మొదలైందనేది రాజుగారి మాట. ఈ సినిమాను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ చేస్తున్నారంట. ఇంటికెళ్లిన తర్వాత దాని గురించే మాట్లాడుకుంటున్నారట.

ఇక సమ్మతమే హీరో కిరణ్ అబ్బవరం మాటలు కూడా దాదాపు ఇలానే ఉన్నాయి. అతడు తన సినిమాను ఏకంగా బ్లాక్ బస్టర్ అనేశాడు. గతంలో ఇతడు చేసిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాకు ఇలానే మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిందట. ఆ తర్వాత అదే బ్లాక్ బస్టర్ అయిందట. ఇప్పుడు సమ్మతమే సినిమాకు కూడా అదే జరుగుతుందంటున్నాడు. ఆడియన్స్ విజిల్స్ వేస్తూ తన సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నాడు. కేక్ కట్ చేసి మరీ ఈ విషయం చెప్పుకొచ్చాడు.

అటు చోర్ బజార్ గురించి ఆకాష్ చెప్పే మాటలు కూడా కోటలు దాటాయి. ఈ సినిమాతో తను మాస్ హీరోగా జనాల్లోకి వెళ్లిపోయానని ప్రకటించుకున్నాడు పూరి తనయుడు. ఈ సినిమా తనకు బ్యూటిఫుల్ మెమొరీ అంటున్నాడు.