దేవరతో నాకు సంబంధం లేదు

ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ లో తన పరిచయాలన్నింటినీ వాడుతున్నాడు తారక్. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లో తనతో కలిసి నటించిన అలియా భట్ ను తెరపైకి…

ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ లో తన పరిచయాలన్నింటినీ వాడుతున్నాడు తారక్. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లో తనతో కలిసి నటించిన అలియా భట్ ను తెరపైకి తీసుకురాగలిగాడు.

ఇలా ఎన్టీఆర్, అలియాభట్ కలవడంతో.. దేవరపై కొత్త పుకారు మొదలైంది. ఈ సినిమాలో అలియా భట్ ఓ కీలక పాత్రలో కనిపించనుందనే పుకారు వ్యాపించింది. దీనిపై అలియా భట్ క్లారిటీ ఇచ్చింది. దేవర సినిమాలో తను లేనని ఆమె స్పష్టంగా తేల్చి చెప్పింది.

దేవర సినిమాను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నాడు. మరోవైపు అలియాభట్ లీడ్ రోల్ లో జిగ్రా అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. అందుకే క్రాస్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్-అలియాను ఒకే వేదికపైకి తీసుకొచ్చాడు. ఇంటర్వ్యూ చేశాడు.

అలా అలియా కోసం ఎన్టీఆర్.. అతడి కోసం అలియా పరస్పరం ముందుకొచ్చారు. అంతేతప్ప, దేవర-1 సినిమాతో అలియాకు ఎలాంటి సంబంధం లేదు.

సెన్సార్ టాక్… మరోవైపు దేవర సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ పై ఓ రేంజ్ లో చర్చ సాగుతోంది. 4 కీలకమైన సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపినట్టు కథనాలొస్తున్నాయి. సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్.. ఆ 4 సన్నివేశాల్లో మార్పులు సూచించినట్టు తెలుస్తోంది.

సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశంలో షార్క్ ఫైట్ కూడా ఉందంటున్నారు. దీంతో పాటు కత్తిపై శరీరం వేలాడే మరో సీన్ పై కూడా సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 27న థియేటర్లలోకి వస్తోంది దేవర చిత్రం.

11 Replies to “దేవరతో నాకు సంబంధం లేదు”

Comments are closed.