తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యానన్న మెగాస్టార్‌

సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం మృతిపై దేశ వ్యాప్తంగా సంతాప ప్ర‌క‌ట‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు వారైన ఏచూరి, విద్యార్థి ద‌శ నుంచే రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. సీపీఎంకు జాతీయ స్థాయిలో నాయ‌క‌త్వం…

సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం మృతిపై దేశ వ్యాప్తంగా సంతాప ప్ర‌క‌ట‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు వారైన ఏచూరి, విద్యార్థి ద‌శ నుంచే రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. సీపీఎంకు జాతీయ స్థాయిలో నాయ‌క‌త్వం వ‌హించ‌డం ప్ర‌తి తెలుగు వ్య‌క్తి గ‌ర్వంచ‌ద‌గ్గ‌ది. సీతారాం ఏచూరి మృతిపై మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాప ప్ర‌క‌ట‌న చేశారు.

సీతారాం మ‌ర‌ణ‌వార్త త‌న‌ను తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్ర‌స్థానం సాగిస్తూ సీతారాం ఏచూరి ఇక లేర‌న్న వార్త తీవ్ర మనోవేదనకు గురి చేసింద‌ని ఆ పోస్టులో వెల్ల‌డించారు. విద్యార్థి కార్యకర్తగా ప్రారంభించినప్పటి నుంచి ఏచూరి ఎల్లప్పుడూ అణగారిన, సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశార‌ని చిరంజీవి కొనియాడారు.

సీతారాం ఏచూరి కుటుంబానికి, అభిమానుల‌తో పాటు సీపీఎం సోదర వర్గానికి త‌న హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ప్రజా సేవ, దేశం పట్ల సీతారాం నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంద‌ని చిరంజీవి పేర్కొన్నారు.

ఏచూరి పార్థివ‌దేహానికి అంతిమ‌యాత్ర వుండ‌ద‌ని ఇప్ప‌టికే సీపీఎం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వైద్య విద్యార్థుల ప‌రిశోధ‌న నిమిత్తం ఎయిమ్స్‌కు ఏచూరి మృత‌దేహాన్ని దానం చేస్తున్న‌ట్టు సీపీఎం ప్ర‌క‌టించింది.

17 Replies to “తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యానన్న మెగాస్టార్‌”

    1. When he was studying JNU was different and now it is different. SFI was spread across states and used to be good organization once. Judging from current scenarios is wrong.

  1. వీడెపుడూ ఇంతే, ఓవర్ గా రియాక్ట్ అవుతాడు ప్రతిదానికీ. మెగా అతి ఫ్యామిలీ

  2. Emundile thanu Hyderabad lo aakraminchina sthalaalaki communist la nundi godavalu raakunda ithagaadiki oka santhapa theermaanaanni prakatisthe sari ani anukoni oka athi statement ichhesadu ee athi lo mega star ayinatuvantu ee jeevi

  3. Sitaram yechuri lost to new CPM ideology that could not do good to poor, and bowed to prakash karat politics. Remained calm and abode to heaven. Salute to real communist.

Comments are closed.