అప్పుడే సెట్స్ పైకి మరో మూవీ

గ్యాప్ ఇవ్వడం నానికి అస్సలు నచ్చదు. ఓ సినిమా పూర్తిచేశామా, ప్రమోట్ చేశామా, రిలీజ్ చేశామా అన్నంత వరకు మాత్రమే. ఆ వెంటనే మరో సినిమా ప్రకటించడం, స్టార్ట్ చేయడం చకచకా జరిగిపోతాయి. Advertisement…

గ్యాప్ ఇవ్వడం నానికి అస్సలు నచ్చదు. ఓ సినిమా పూర్తిచేశామా, ప్రమోట్ చేశామా, రిలీజ్ చేశామా అన్నంత వరకు మాత్రమే. ఆ వెంటనే మరో సినిమా ప్రకటించడం, స్టార్ట్ చేయడం చకచకా జరిగిపోతాయి.

నాని కెరీర్ లో ఎప్పుడూ జరిగేదే ఇది. ఈసారి కూడా అదే జరిగింది. సరిపోదా శనివారం సినిమాను రిలీజ్ చేసిన ఈ హీరో, ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. శైలేష్ కొలనుతో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు.

శైలేష్ దర్శకత్వంలో “హిట్: ది థర్డ్ కేస్” సినిమా ఎనౌన్స్ చేశాడు నాని. రీసెంట్ గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈరోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. కెరీర్ లో నానికి ఇది 32వ సినిమా.

తొలిరోజు నాని సెట్స్ పైకి వచ్చాడు. అతడిపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించబోతున్నాడు నాని. ఈ సినిమాను చిన్న పిల్లలు చూడొద్దంటూ ఇప్పటికే నాని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి నిర్మాత కూడా నానీనే. ఈసారి యూనానిమస్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ యాడ్ అయింది. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది మే 1న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

3 Replies to “అప్పుడే సెట్స్ పైకి మరో మూవీ”

Comments are closed.