తిహార్ జైలు నుండి విడుద‌లైన ఢిల్లీ సీఎం!

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆయ‌న జైలు నుండి విడుదలయ్యారు. వ‌ర్షంలో త‌డుస్తునే త‌మ అధినేత జైలు నుండి బ‌య‌ట‌కు రావ‌డంతో తిహార్…

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆయ‌న జైలు నుండి విడుదలయ్యారు. వ‌ర్షంలో త‌డుస్తునే త‌మ అధినేత జైలు నుండి బ‌య‌ట‌కు రావ‌డంతో తిహార్ జైలు వ‌ద్ద ఆప్ సీనియ‌ర్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దాదాపు ఆరు నెల‌ల‌కుపైగా జైల్లో గ‌డిపిన కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

జైలు నుండి బ‌య‌టికి వచ్చిన సీఎం కేజ్రీవాల్ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశిస్తూ ‘ఇంత వ‌ర్షంలోను పెద్ద సంఖ్యంలో ఇక్క‌డికి వ‌చ్చారు. అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా.. నా జీవితాన్ని దేశానికి అంకితం చేశా.. నా జీవితంలో ఎన్నో పోరాటాలు చేశా.. క‌ష్టాల‌ను ఎదుర్కొన్నా.. దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడు.. కొంత మంది న‌న్ను జైల్లో పెట్టి నా ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బతీయ‌ల‌ని చూశారు.. కానీ నా ఆత్మ‌విశ్వాసం 100 పెరిగింద‌ని.. దేశాన్ని చీల్చేందుకు ప్ర‌య‌త్నించే శ‌క్తుల‌తో పోరాటం చేస్తునే ఉంటా’నని చెప్పారు.

హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో కేజ్రీవాల్ జైలు నుండి బ‌య‌టి రావ‌డంతో ఆప్ నేత‌లు ధీమాగా ఉన్నారు. త‌మ పార్టీ మ‌రింత పుంజుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఢిల్లీ మ‌ద్యం కేసులో ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, పారిశ్రామిక వేత్త‌లు కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బ‌య‌టికి వ‌స్తున్నారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముందు కూడా ఎన్నిక‌ల ప్ర‌చార నేప‌ధ్యంలో బెయిల్ మీద బ‌య‌టికి వ‌చ్చి త‌న పార్టీ కోసం పెద్ద ఎత్తున్న ప్ర‌చారం చేశారు. ఎన్నిక‌ల అనంత‌రం తిరిగి జైలుకు వెళ్ల‌గా ఇవాళ బెయిల్ ల‌భించింది.

5 Replies to “తిహార్ జైలు నుండి విడుద‌లైన ఢిల్లీ సీఎం!”

  1. జై/ లు నుంచి విడుదలైక, సత్యమే గెలిచింది అనే ఊకదంపుడు డైలోగ్స్ ఎక్కువయ్యాయి ఏ ఈమధ్య.

Comments are closed.