అలియా భ‌ట్ హాలీవుడ్ ఎంట్రీ!

ఒక‌వైపు బాలీవుడ్ లో సోలో గా త‌నే ప్ర‌ధాన పాత్ర‌ల్లో సినిమాల‌ను లీడ్ చేసే స్థితిలో ఉంటూ, ఇంకోవైపు సౌత్ నుంచి భారీ సినిమాల అవ‌కాశాల‌ను పొందుతున్న అలియా భ‌ట్ హాలీవుడ్ ఎంట్రీ కూడా…

ఒక‌వైపు బాలీవుడ్ లో సోలో గా త‌నే ప్ర‌ధాన పాత్ర‌ల్లో సినిమాల‌ను లీడ్ చేసే స్థితిలో ఉంటూ, ఇంకోవైపు సౌత్ నుంచి భారీ సినిమాల అవ‌కాశాల‌ను పొందుతున్న అలియా భ‌ట్ హాలీవుడ్ ఎంట్రీ కూడా ఖ‌రారు అయ్యింది. 

నెట్ ఫ్లిక్స్ తీస్తున్న సినిమా అలియా హాలీవుడ్ డెబ్యూ కానుంది. ఈ మేర‌కు నెట్ ఫ్లిక్స్ అలియా హాలీవుడ్ ఎంట్రీని అధికారికంగా ధ్రువీక‌రించింది.  

'హార్ట్ ఆఫ్ స్టోన్' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. అలియా భ‌ట్ ఫొటో గ్రాఫ్ ను షేర్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ లో ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. 

అలాగే ఈ సినిమాలో అలియాతో పాటు న‌టిస్తున్న 'వండ‌ర్ వుమ‌న్' స్టార్ గాల్ గ‌డోట్ కూడా సెట్స్ మీద నుంచి ఫొటోను షేర్ చేస్తూ.. అలియాకు స్వాగ‌తం ప‌లికింది.

గ‌డోట్ ది ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌గా తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌తీయ ఫిల్మ్ మేక‌ర్ల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అలియా భ‌ట్ అంత‌ర్జాతీయ స్థాయిలో ఏ మేర‌కు షైన్ అవుతుందో!