బక్కపల్చని శ్రీలీల అంత బరువు మోయగలదా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది శ్రీలీల. ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫెయిలైనా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే, తన ప్రతి సినిమాలో ఆమె నంబర్-2 మాత్రమే. హీరోకే ఎక్కువ…

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది శ్రీలీల. ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫెయిలైనా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే, తన ప్రతి సినిమాలో ఆమె నంబర్-2 మాత్రమే. హీరోకే ఎక్కువ ప్రయారిటీ ఉండేది. కానీ తొలిసారి శ్రీలీలపై చాలా భారం పడింది. ఓ సినిమాను తానే మోయాల్సి వస్తోంది. అదే ఆదికేశవ.

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఆదికేశవ. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వైష్ణవ్ ట్రాక్ రికార్డ్ గురించి అందరికీ తెలిసిందే. ఉప్పెన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. దీంతో ఆదికేశవ భారం మొత్తం శ్రీలీల పైన పడింది. ఈ సినిమా ప్రచారం మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతోంది. 

ఆదికేశవ సినిమాకు సంబంధించి మెయిన్ ఎట్రాక్షన్ శ్రీలీల మాత్రమే. ఇంతకుముందే చెప్పుకున్నట్టు హీరో ట్రాక్ రికార్డ్ బాగాలేదు. డైరక్టర్ కొత్త. స్టార్ మ్యూజిక్ డైరక్టర్ లేడు. ప్యాడింగ్ కూడా అంతంతమాత్రమే. సో.. ఈ సినిమా మొత్తానికి శ్రీలీలే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అందుకే ప్రమోషన్ కూడా ఆమె చుట్టూరా తిరుగుతోంది.

స్కంద సినిమాతో ఫ్లాప్ అందుకుంది శ్రీలీల. ఆ వెంటనే భగవంత్ కేసరి సినిమాలో మంచి పాత్ర పోషించి అందరి మెప్పు పొందింది. ఇప్పుడు అదే సక్సెస్ ను కొనసాగించాలంటే, ఆదికేశవ హిట్టవ్వాల్సిందే. ఈసారి భారం శ్రీలీలదే.