Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ ఒక్క ఆనందం లేకుండా పోయిందిగా..!

ఆ ఒక్క ఆనందం లేకుండా పోయిందిగా..!

బన్నీ బర్త్ డే కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది చాలా రోజులైంది. అతడి పుట్టినరోజు కోసం అల్లు అర్జున్ ఆర్మీ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. దీనికి రెండు కారణాలు. ఆ రోజున పుష్ప-2 టీజర్ రిలీజ్ అవుతోంది. అదే రోజున అల్లు అర్జున్ తదుపరి సినిమా వివరాలు కూడా అధికారికంగా బయటకొచ్చే అవకాశం ఉంది.

నిజానికి అల్లు అర్జున్ ఆర్మీది డబుల్ జోష్ కాదు, ట్రిపుల్ జోష్. ఎందుకంటే, ఆ రోజున బన్నీ సినిమా అప్ డేట్స్ తో పాటు.. అతడి సినిమాల రీ-రిలీజెస్ కూడా ఉన్నాయి. ఇలా రీ-రిలీజ్ తో పండగ చేసుకుందామనుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఆ ఆనందం లేకుండా పోయింది.

అవును.. 8వ తేదీన అట్టహాసంగా రిలీజ్ అవుతుందనుకున్న ఆర్య-2 సినిమా వాయిదా పడింది. ఆరోజున ఆర్య-2ను రీ-రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. అంతేకాదు, అదే రోజు విడుదల కావాల్సిన జులాయి కూడా వాయిదా పడింది.

ఈమధ్య ఏ హీరో పుట్టినరోజు వచ్చినా ఆ హీరోకు చెందిన సినిమాలు రీ-రిలీజ్ చేయడం కామన్ గా మారింది. మొన్నటికిమొన్న చరణ్ పుట్టినరోజు నాడు మగధీర, నాయక్ సినిమాల్ని రీ-రిలీజ్ చేశారు. అదే విధంగా బన్నీ బర్త్ డేకి జులాయి, ఆర్య-2 ను రీ-రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడా ప్లాన్స్ నుంచి తప్పుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూసింత నిరుత్సాహంలో ఉన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?