జవాన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న బన్నీ

షారూక్ నటించిన సినిమా జవాన్. ఈ మూవీతో అల్లు అర్జున్ కు ఎలాంటి కనెక్షన్ లేదు. షారూక్ ఖాన్, బన్నీ ఫ్రెండ్స్ కూడా కాదు. కానీ జవాన్ కోసం బన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. దీనికి…

షారూక్ నటించిన సినిమా జవాన్. ఈ మూవీతో అల్లు అర్జున్ కు ఎలాంటి కనెక్షన్ లేదు. షారూక్ ఖాన్, బన్నీ ఫ్రెండ్స్ కూడా కాదు. కానీ జవాన్ కోసం బన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. దీనికి కారణం షారూక్ కాదు, ఆ సినిమా దర్శకుడు అట్లీ.

కొన్నాళ్లుగా బన్నీ-అట్లీ కాంబినేషన్ పై చర్చ నడుస్తోంది. తాజాగా కూడా మరోసారి వీళ్లిద్దరి పేర్లు తెరపైకొచ్చాయి. అట్లీ దర్శకత్వంలో బన్నీ నటించే ఛాన్స్ ఉందంటూ కొంతమంది అప్పుడే కథనాలు కూడా అల్లేశారు. అయితే ఇద్దరి మధ్య ఇప్పుడు జవాన్ సినిమా ఉంది.

మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా విడుదలవుతోంది జవాన్ మూవీ. ఈ సినిమా రిజల్ట్ కోసం బన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్టయితే, కచ్చితంగా బన్నీ నుంచి అట్లీకి పిలుపు వెళ్తుంది. ఎందుకంటే, బన్నీ కూడా పాన్ ఇండియా దర్శకుల కోసం చూస్తున్నాడు.

పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. ఇప్పుడు పుష్ప-2తో మరోసారి నేషనల్ లెవెల్ క్రేజ్ పై కన్నేశాడు. ఈ ఊపును ఇలానే కొనసాగించాలంటే, వెంటనే మరో పాన్ ఇండియా దర్శకుడితో సినిమా ఎనౌన్స్ చేయాలి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా ప్రకటించినప్పటికీ, అతడు వెంటనే అందుబాటులోకి వచ్చేలా లేడు.

సో.. ఈ గ్యాప్ లో అట్లీకి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్. అలా జరగాలంటే జవాన్ సినిమా హిట్టవ్వాలి. అందుకే షారూక్ నటించిన ఈ సినిమాపై ఓ కన్నేసి ఉంచాడు.