నిజ జీవితంలో మేనమామ-మేనల్లుడు అయిన వెంకీ-చైతన్యలు కలిసి నటిస్తున్న సినిమా వెంకీమాట. పీపుల్స్ మీడియా పతాకంపై తయారవుతున్న ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలకు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో హీరో చైతన్య బర్త్ డే సందర్భంగా టీజర్ లాంటి విడియో ఒకటి విడుదల చేసారు. ఇది కూడా ఓ విధంగా టీజర్ అనుకోవాలి. ఎందుకంటే కథను కాస్త సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం అయితే విడియోలో జరిగింది.
మామా అల్లుళ్ల హుషారు. అల్లుడి ప్రేమ కథ, ఆపై మిలట్రీలో చేరడం, బోర్టర్ లోకి వెళ్లడం, అల్లుడి కోసం మామ మిలట్రీ అధికారుల దగ్గరకు వెళ్లి వాకబు చేయడం ఇవన్నీ విడియోలో చోటు చేసుకున్నాయి. మధ్యలో గ్యాప్ లు ఫిల్ చేసుకుని కథను ఊహించుకోవడం సినిమా లవర్స్ కు పెద్ద కష్టం కాదు.
ఆ సంగతి అలావుంచితే వదిలిన విడియో మాత్రం కలర్ పుల్ గా, అన్ని రకాల ప్రేక్షకులను సినిమాకు రప్పించే ప్రయత్నం సినిమాలో వున్నట్లుగా స్పష్టం చేస్తోంది. బాబి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.